చీకటి, నిశ్శబ్దం
పెళ్ళైన వారానికి ఇంటాయన నన్ను, ఆ ఇంటిపైన పడకగది మధ్యలో ఉన్న దూలానికి ఓ రెండు ఇనుప పట్టీలతో నట్టు బోల్ట్‌లతో బిగించారు. అది నా జీవితానికి నాంది. మొదట్లో, రాత్రి 8 గంటలకు తిరగడం మొదలుపెడితే ఉదయం 5 కల్లా ఆగిపోయేదాన్ని. కొత్తగా పెళ్లైన జంట వారి మధుర క్షణాలను, చెవుల్లో గుసగుసలను, చెమటతో

