పలుకు గురించి

ఎవరు? ఏమిటి? ఎందుకు? ఎలా?

ఎవరు:
పలుకు.ఇన్ ఒక కొత్త ప్రయత్నం. మన ట్విట్టర్ (X) నేస్తులమే కొందరం కలిసి, మనకంటూ ఒక ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసుకుందామన్నది, ఉద్దేశ్యం.

ఏమిటి?
తెలుగుదనానికి, తెలుగు రచనలకి ప్రథమ తాంబూలం/పెద్ద వాయినం అందించాలన్నది ముఖ్యోద్దేశం. ఆ ఆలోచనతో ముందుకు వచ్చిన/మీ ముందుకి తెచ్చిన ప్రత్యేకమైన వేదిక, “పలుకు.”

ఎందుకు?
ట్విట్టర్, ఫేస్‌బుక్‌వంటి వేదికలపై మన రాతలు కాలం గడచే కొద్దీ, వెతకటం, తిరిగి పొందటం ఒక ఇబ్బంది. అలాగే, భాష, భావ నియంత్రణల విలువలు కొరవడుతున్నయన్నది మరొక బాధ.

ఆహ్వానం మేరకు మాత్రమే సభ్యత్వం లభించే ఈ “పలుకు” వేదిక అశ్లీలత, అసభ్యత, దుర్భాషలకు పూర్తిగా దూరం. సంస్కారవంతమైన భాష, చదువరులు మెచ్చగల విలువలు పాటించే మేలైన మాటకే ప్రాధాన్యం. ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌ (pay-wall), అల్గారిథమ్ (algorithm) వంటి పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ.

ఈనాటి డిజిటల్ కాలంలో, అనేక యాసల ఊసుల కొత్త సోకులద్ది మీలోని భావుకత వెలికి తేగల తెలుగు కథలు, కవితలు, వేర్వేరు చర్చా విషయాలను మేము చదివి, మన తోటి తెలుగు భాషాభిమానులకు, ఔత్సాహిక రచయితలకు, తెలుగు పాఠకులకు కూడా పరిచయం చేసి మురిసిపోదామన్న ప్రయత్నమే ఈ “పలుకు.”

ఎలా?
మీరు కూడా మీ అనుభవాలు, ఆలోచనలు, సృజనాత్మకత ఈ వేదికపై పంచుకోవచ్చు.
ఔత్సాహిక రచయితలు Register ద్వారా చేరవచ్చు.

కేవలం తెలుగు మాత్రమేనా?
తెలుగు భాష వాడుకరులకు మరింత చేరువ కావాలని, మంచి తెలుగు రచనలు మనందరికి పరిచయం కావాలన్నది ప్రధానమైన ఆశయం.
ఇప్పటి తరం వారికి, పూర్తిగా తెలుగులోనే రాయటం, చదవటం, మాట్లాడటం కొంత మేర ఇబ్బంది అవుతున్న మాట కూడా వాస్తవమే కనుక, అప్పుడప్పుడు ఇంగ్లిషులో కూడా రాయలనుకుంటే అభ్యంతరం ఉండబోదు.
ప్రముఖంగా తెలుగుని ప్రోత్సహించటం జరుగుతుంది. అంతే.

Read About Us in English

For any queries, Contact Us

x.com/palukublog