రాజమ్మ
“ముసలిది ఇంకా ఎంత కాలం బ్రతుకుతాదో, చెయ్యలేక చస్తున్నా” అంటూ పక్క ఎక్కింది సుమిత్ర. ఏమమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం. ఆ ముసలిదీ ఆయనకు నానమ్మ పేరు రాజమ్మ, గత ముప్పై ఐదు ఏళ్ళుగా మంచాన పట్టి ఉంది. మాట రాదు, ఎవ్వరిని గుర్తుపట్టదు, ఒంట్లో ఏ అవయవం కదల్దు. ఒరిస్సాలో జయపూర్లో మెయిన్ రోడ్కు

