చింతపండు కొద్దిగ
బెల్లమింత మెండుగ
స్వల్పంగా ఉప్పుకల్లు
చిరు చేదుర వేపపూలు
మామిడి పిందెల వగరు
మిరపగింజ కెంత పొగరు
ఆరు రుచులు నిండుగ
సంవత్సరాది పండుగ
పరాభవనామ మీఏటిది
మన ఇడుములన్ని వీడగ
చుట్టాలు నేస్తాలు కలిసి
ఇరుగుపొరుగులెల్ల అండగ
లోకమెల్ల శుభముగాగ
ఆనంద హేల నిండుగ

#వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #ఉగాది, #పరాభవనామసంవత్సరాది, #పండుగలు, #కవిత

@Chandu1302

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

Evening

While flipping through life’s pages My gaze fell on a
kumble aavu

6. కుంబ్లే ఆవు

చిన్నప్పుడు బిగ్ ఫన్ అనే బబ్బులుగమ్ము వాడు ప్రతీ బబ్బులుగమ్ము కవర్ లోపల