ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ!

జారిపోవడానికో జాతి,

కుళ్ళిపోవడానికో కులం,

మోసపోవడానికో మతం,

విడిపోవడానికో వర్గం,

గందరగోళానికో గుంపు,

అవే ఉన్నాయి ఇక్కడ, మనిషి అస్థిత్వం స్థిరం నాస్తి!

ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ,

మితృ-మితృ-శతృవుల్లెవ్వరూ లేరిక్కడ,

అవసరాలేమి లేవిక్కడ, ఆకలి, వాంఛల అవకాశాలు మాత్రం ఉన్నాయిక్కడ

ఆకలి కేకలి ఆలోచన్లు , వాంఛల ప్రకోపాలు అవే ఉన్నాయి ఇక్కడ,

పూడ్చిపెడితే మట్టైపోతావు,

తగలబెడితే మసైపోతావు,

నీదేం ఆలోచన?, నీదేం ప్రకోపం?

స్మశానంలో యుద్ధమూ ఉండదూ, శాంతీ ఉండదూ!

ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ!

#అంతర్వాహిని

1

4 Comments Leave a Reply

  1. చాలా బాగా రాసేరు ..

    చిన్న నిడివిలోనే వైవిధ్య భావోద్వేగాలు స్పృశించారు ..

    ఆవేశం / ఆక్రోశం / నైరాశ్యం / వైరాగ్యం ఇలాటి విషయాలన్నీ ఇంత చిన్ని నిడివిలోనే పలికించేశారు

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

నా టర్కీ యాత్ర

2012. జూన్. ఇరాన్ నుంచి 30 కోట్ల యూరోల చక్కెర బిజినేస్ కన్ఫర్మ్

మళ్ళీ పెళ్లా ..

ధాతా నామ సంవత్సరం, శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ల కాలం.