చింతపండు కొద్దిగ
బెల్లమింత మెండుగ
స్వల్పంగా ఉప్పుకల్లు
చిరు చేదుర వేపపూలు
మామిడి పిందెల వగరు
మిరపగింజ కెంత పొగరు
ఆరు రుచులు నిండుగ
సంవత్సరాది పండుగ
పరాభవనామ మీఏటిది
మన ఇడుములన్ని వీడగ
చుట్టాలు నేస్తాలు కలిసి
ఇరుగుపొరుగులెల్ల అండగ
లోకమెల్ల శుభముగాగ
ఆనంద హేల నిండుగ

#వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #ఉగాది, #పరాభవనామసంవత్సరాది, #పండుగలు, #కవిత

@Chandu1302

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

కనాట్ ప్లేస్ కథలు (ఎండీ నుండి లేఖ)

బ్యాంక్ ఉద్యోగంలో కఠిన మైనది,అందరూ కోరుకునేది foreign Exchange(Forex) dept. అంతా రూల్స్

బాల్యం కబుర్లు -1

నాది 1953 ఆగస్ట్21 జననం. ఇక్ష్వాకుల కాలం అనిలెక్కలు వేసు కొంటున్నారా? అవును