Chandrasekhar Kondubhotla

మనసు తానై తానె నేనైంది నా పెంటి

సేను కాడ నేను సెమట గారుత వుంటేసెంగుతో తుడిసి నా అలుపు పోగొడతాదిసెలమ దడిసీ ఒల్లు సితసితామంటాంటెఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాదిఅరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపిముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాదిఅమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాదిఆలి ప్రేమకు ఇంగొక్క పేరు తానెలెమ్మంటాది గొంతు పొలమారితే నా సవితంటు నగుతాది గుండె తడిబారెనా తానె దిండై ఓదారుస్తాదినా ఇంటి ముంగిట్ల మావి
September 16, 2025
213 views

జయ జయ జయ శ్రీ వినాయకా

జయ జయ జయ శ్రీ వినాయకామమ్మెన్నడు కావవె వినాయకాగణరాయ జయము శ్రీ వినాయకాభక్తజన గణ రక్షక వినాయకా అంబ నలచె నలుగు శ్రీ వినాయకాసలుగు నిన్ను బడయగా వినాయకాగడప నిలిపి అయ్యను శ్రీ వినాయకాగజముఖధారి వైతివట వినాయకా అమ్మ యానతి నీకట శ్రీ వినాయకాఅబ్బ అబ్బొ యనంగదె వినాయకాశివ తాండవ కేళి నీవె శ్రీ వినాయకాగౌరి ముద్దు పట్టి
September 6, 2025
31 views

దయ కావు మమ్ము శ్రీవినాయకా

గౌరీ ప్రియసుత శంకర మోదకషణ్ముఖ భ్రాతా వినాయకామూషిక వాహన జనగణ వందనగజముఖ రాయా వినాయకా శ్రీకర శుభకర త్రిజగోద్ధారకలోకపాలకా వినాయకాదుష్ట సంహారక దురిత నివారకవిశ్వరక్షకా వినాయకా ప్రథమ పూజితా ప్రాజ్ఞ వందితాబ్రహ్మాండ నాయక వినాయకాపాశాంకుశధర పన్నగ భూషితసర్వమంగళ కారక వినాయకా రావణ బాధక శశాంక విదారకత్రిగుణ రూపకా వినాయకాసిద్ధి ప్రసాదక బుద్ధి ప్రచోదకమోక్షదాయకా వినాయకా మోదక భక్షక పరిజన
August 27, 2025
119 views

పలుకు.ఇన్

“పలుకు!” చక్కటి తెలుగు పదం ఇది. సూచించిన హర్షకు అనేక అభినందనలు. ఈ వేదిక సుందరంగా అగపడుతున్నదని మీలో ఏ కొందరు సంతోషించినా, ఆ ఖ్యాతికి హర్షకు కూడా హక్కుంది. మాధురి, ఆదిత్య మిగిలిన ఇద్దరూ. దీక్ష, దక్షత అనే పదాలకు వీళ్ళే నిర్వచనమేమో అన్నంత కృషి. నిజానికి, ఇంకా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ‘పలుకు.ఇన్’లో లాగిన్ అయే మనమంతా
August 15, 2025
36 views

శివోఽహమ్

ఏంది నాసుట్టు నేనేంది ఈడనిరోజు సదమద మైతరొ శివిగాసదువూ గురువూ ఎరగని జీవిరఇవరం నివ్వే దెలుపరొ శివిగా యాడ నీ ఇల్లు యేది నీ కొలువంటబగు ఆత్రము ఆగమైతరో శివిగాపురుగు బుట్రకే నీ ఆదరమాయెననేనీడ నీ నీడ గోరి అల్లాడగ శివిగా సేదుకో నన్నని అడిగినంతనేఅదుకుంటవని పేరుర శివిగాశివ శివాయంటె సెవికినపడదానీకు సెవుఁడా ఏందిర శివిగా నిన్ను దలపకుండ
August 1, 2025
43 views

ఆకొన్న కూడె యమృతము

పూర్వం ధారా నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు కాపురముండేవాడు. భుక్తి గడచేది కాదు. కుటుంబపోషణార్థం యాచకవృత్తి నవలంబించినవాడు. రాజాశ్రయం పొందితే ధనధాన్యాలకు లోటుండదని ఎవరో సలహా ఇస్తే, ఆ ప్రయత్నం చేయాలని ఆశ. కానీ ఏమంత చదువు సంధ్యలున్నవాడు కాదు. అపండితుడు. మరి రాజ దర్శనమెలా? అదీ తాను చేరవలసింది మహారాజు భోజుని దర్బారు! ఏదైనా కవిత్వం రాసుకెళ్ళి
July 29, 2025
27 views

హృదయ పలకం

ఇవి పలక, బలపాలు.అంటే, మనం ఒద్దూ, నా మనస్తత్వానికది పడదూని ఎంత మంచితనంగా చెప్పినా, కాదూ, నువ్వు వెళ్ళాలమ్మా, ప్లీజ్‌రా అని మనల్ని మొండితనంగా చీపురుకట్టతోటో, మూల కాడున్న కర్రతోటో, ఏడ్చి పోతూంటారే? బడి. అందుకోసం. ఆ బళ్ళో పడిపొయ్యాక, మన పేరూ, నాన్న పేరూ, ఎన్ని రాసినా అయిపోని తెలుగష్చరాలూ, క కొమ్ము దీర్గమిస్తే కూ చుక్
July 29, 2025
44 views

‘మిడిల్’క్లాస్

మొన్నో, ఇంకేదో ఈమధ్యనో ట్విట్టర్‌లో ఒక మెసేజ్ చూసా. నువ్వు చిన్నప్పుడు టూత్‌పేస్టు ట్యూబు చివరికంటా నొక్కి వాడావా, సబ్బంతా అరగదీసాక మిగిల్న ముక్క కొత్త సబ్బుకతికించావా, బొగ్గుల బాయిలర్లో వేణ్ణీళ్ళు కాచుకున్నావా, సరుకుల కొట్లో బెల్లం ముక్కడిగావా, కిరసనాయిలు కోసం క్యూలో నించున్నావా… ఇలా. ఇవన్నీ చేసుంటే నువ్వు డెబ్భైలు ఎనభైల్నాటి మిడిల్ క్లాసు తెలుగోడని అర్థం!
July 29, 2025
42 views

“పుల్లంపేట జరీచీర” – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిన్నకథ “పుల్లంపేట జరీ చీర.” సాధారణ కుటుంబాలలోని, అత్యంత సాధారణమైన సన్నివేశం, పండగలకో, మరొక శుభసందర్భానికో కొత్త బట్టలు కోరుకోవటం. ఆ ఆశ కొన్నిమార్లు తీరటం, ఎన్నోమార్లు మరొక పండగనాటికో, మరుసటేడాదికో వాయిదా పడటం. ఇది మామూలే అనేకంటే, ఇదే మామూలు అనుకోవచ్చేమో. ఇప్పటికి ఒక యాభై
July 25, 2025
43 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog