ఉగాది మేల్తలపు

తీపీ కారం చేదూ వగరూ
ఉప్పూ పులుపూ కలగలుపూ
కష్టం నష్టం బాధల వెంటే
సుఖసంతోషాలు; కొసమెరుపు

గడచిన కాలం ఇక్కట్లు
కాలం తీరిన ముచ్చట్లు
నేడు రేపు ముందునాళ్ళు
ఆశల పూతల పొదరిళ్ళు

బతుకు భారమని వెఱవకు నేస్తం
సుఖం నీదంటు మురియకు నిత్యం
వెతలు వేదనల ఆటుపోటులను
దాటుకు చేరగ సుఖశాంతుల తీరం

సుఖము శాంతి వ్యధ ఆశాంతి
భోగం భాగ్యం కోపం తాపం
విస్తరి నిండుగ విందు భోజనం
ఎరిక తెలియగా అనుభవ సారం
జగతికి నేడిది ఉగాది సందేశం
ఓడి గెలవమని ‘పరాభవ’ పాఠం

#వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #ఉగాది, #పండుగలు, #పరాభవనామసంవత్సరాది

@vennela

1

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

హృదయ పలకం

ఇవి పలక, బలపాలు.అంటే, మనం ఒద్దూ, నా మనస్తత్వానికది పడదూని ఎంత మంచితనంగా

ఐ ఫోన్లో తెలుగులో టైప్ చేయడం ఎలా?

మీ ఐఫోన్లో సెట్టింగ్స్ తెరచి జనరల్ -> కీ బోర్డ్ దగ్గరకి వెళ్ళండి.