#అమ్మనుడి

అభీ నజావో ఛోడ్ కర్

by
అలెక్సాలో “అభీ నజావో ఛోడ్ కర్” అన్న పాట వస్తోంది. ఆ పాట విన్నపుడల్ల తనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. జయదేవ్నీ రఫీనీ ఆషాని మెచ్చుకోకుండా ఉండలేడు. అంత మధురంగా ఉంటుంది, గ్లాస్ లో సింగల్ మాల్ట్ వేసుకొని స్టూడియోలోని కుర్చీలో కూర్చొని ఆ ఆరు పెయింటింగ్స్ వైపే చూస్తున్నాడు. గిరీశం ఇప్పటికి 6 సార్లు వెయ్యటానికి
December 25, 2025
9 views

గమనం

by
అనిత, సుజాత, ప్రమీల, శైలజల స్నేహం చాలా బలమైనది. వాళ్ళ నలుగురి స్నేహాం ఆరో తరగతి విజయనగరంలో మొదలైంది. ఒకే బెంచ్ మీద నలుగురు కూర్చునేవారు. ఒకేసారి మధ్యాహ్నం భోజనానికి డబ్బాలు తెరిచేవారు, వారు తెచ్చుకున్న వాటిని పంచుకొని తినేవారు. ఆస్తిపాస్తుల్లో తేడాలు ఉన్నప్పటికీ పెద్దగా అభిప్రాయాలూ కానీ వాటి బేధాలు కానీ ఏమి లేవు వారిలో. పదో
November 1, 2025
20 views

“తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” ప్రసంగంపై వ్యాసము – అభిప్రాయము

అంతర్జాల వేదికగా “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” వారు నిర్వహించిన సదస్సులో “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” అనే శీర్షిక పైన శ్రీ హేలీ కళ్యాణ్ గారి ప్రసంగంపై చిన్న వ్యాసము. ఇటువంటి విషయంపై వినడము కొత్త అనుభవం. కవితలు, అలంకారాలు, భక్తి సాహిత్యం , కావ్యాలు వంటి ప్రక్రియలపై మక్కువ తో
October 13, 2025
71 views

“వస్తానన్నాడు”

by
బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది ప్రియ. నిశ్శబ్దం… గాలి కూడా కదలని నిశ్చలత. ఆకాశం మేఘాలతో కప్పబడి, చంద్రుడు, చుక్కలు కనిపించటం లేదు. వర్షం వస్తుందేమో అనిపించింది. కరెంటు పోయి, చుట్టూ చీకటి. గదిలోనూ అంధకారమే. ఇన్వర్టర్ పనిచేయక చాలా కాలమైంది. కొవ్వొత్తి వెలిగించాలన్న ఆలోచన కూడా రాలేదు. “వస్తానన్నాడు…”
September 23, 2025
23 views

మనసు తానై తానె నేనైంది నా పెంటి

సేను కాడ నేను సెమట గారుత వుంటేసెంగుతో తుడిసి నా అలుపు పోగొడతాదిసెలమ దడిసీ ఒల్లు సితసితామంటాంటెఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాదిఅరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపిముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాదిఅమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాదిఆలి ప్రేమకు ఇంగొక్క పేరు తానెలెమ్మంటాది గొంతు పొలమారితే నా సవితంటు నగుతాది గుండె తడిబారెనా తానె దిండై ఓదారుస్తాదినా ఇంటి ముంగిట్ల మావి
September 16, 2025
213 views

జయ జయ జయ శ్రీ వినాయకా

జయ జయ జయ శ్రీ వినాయకామమ్మెన్నడు కావవె వినాయకాగణరాయ జయము శ్రీ వినాయకాభక్తజన గణ రక్షక వినాయకా అంబ నలచె నలుగు శ్రీ వినాయకాసలుగు నిన్ను బడయగా వినాయకాగడప నిలిపి అయ్యను శ్రీ వినాయకాగజముఖధారి వైతివట వినాయకా అమ్మ యానతి నీకట శ్రీ వినాయకాఅబ్బ అబ్బొ యనంగదె వినాయకాశివ తాండవ కేళి నీవె శ్రీ వినాయకాగౌరి ముద్దు పట్టి
September 6, 2025
31 views

భాషాకుమారుడి స్వగతం

చేతులతో తన ముఖాన్ని మూసిన వెంటనే ఉన్నట్టుండి మాయమైపోయిందనీ, “బుయ్” అంటూ చేతులు తీసిన వెంటనే ఎలానో తిరిగి ఎదుటన ప్రత్యక్షమైందనీ అమ్మకేసి ఇంతింత చేసుకున్న లేతకళ్లతో చూస్తుండిపోయే ఆశ్చర్యానందాల పాలపాపాయిగా ఉన్నప్పుడే తెలుగు భాష మనల్ని పలుకరించింది. అప్పుడు చెవులతో కాదు, గుండెతో తెలుగును విన్నాం, అమ్మ నోటితో ఏదో చప్పుడు చేస్తోందని అనుకుంటూ. సహజశక్తులు మనలో
August 19, 2025
59 views

ఆకొన్న కూడె యమృతము

పూర్వం ధారా నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు కాపురముండేవాడు. భుక్తి గడచేది కాదు. కుటుంబపోషణార్థం యాచకవృత్తి నవలంబించినవాడు. రాజాశ్రయం పొందితే ధనధాన్యాలకు లోటుండదని ఎవరో సలహా ఇస్తే, ఆ ప్రయత్నం చేయాలని ఆశ. కానీ ఏమంత చదువు సంధ్యలున్నవాడు కాదు. అపండితుడు. మరి రాజ దర్శనమెలా? అదీ తాను చేరవలసింది మహారాజు భోజుని దర్బారు! ఏదైనా కవిత్వం రాసుకెళ్ళి
July 29, 2025
27 views

హృదయ పలకం

ఇవి పలక, బలపాలు.అంటే, మనం ఒద్దూ, నా మనస్తత్వానికది పడదూని ఎంత మంచితనంగా చెప్పినా, కాదూ, నువ్వు వెళ్ళాలమ్మా, ప్లీజ్‌రా అని మనల్ని మొండితనంగా చీపురుకట్టతోటో, మూల కాడున్న కర్రతోటో, ఏడ్చి పోతూంటారే? బడి. అందుకోసం. ఆ బళ్ళో పడిపొయ్యాక, మన పేరూ, నాన్న పేరూ, ఎన్ని రాసినా అయిపోని తెలుగష్చరాలూ, క కొమ్ము దీర్గమిస్తే కూ చుక్
July 29, 2025
44 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog