2015 లో మా ఓనర్ కు ఇరాన్ లో ఒక పోర్ట్ లో sugar ని స్టోర్ చేసి లోకల్ గా అమ్మితే ఎలా ఉంటుందో అని ఐడియా వచ్చింది. లేడి కి లేచిందే పరుగు లా నన్ను, నా బాసును ఇరాన్ పొమ్మన్నాడు. ఇరాన్ /ఇరాక్ సరిహద్దు లో ఉన్న “బందర్ ఇమాం ఖొమేని” అనే పోర్ట్ కు వెళ్ళాలి. మాకు ఇరాన్ లో ఉన్న ఒక లాయర్ ను కాంటాక్ట్ చేసి అక్కడ మీటింగ్ ఏర్పాట్లు చేయమని చెప్పి ఒక శుభ ముహూర్తం లో బయలు దేరాము.
EK లో నేను + బాసు FC. నేను మూట ముల్లి తో దుబాయ్ ఎయిర్పోర్ట్ చేరాను.చెకిన్ చేసి అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నా. వెనక నుండి మొహిద్దిన్ జి అని బస్సు పిలుపు.. పదండి లౌంజ్ కు అన్నాడు. . ఏమి తిందాం అన్నాడు. నేను మీ ఇష్టం అన్నాను.
Caviar తిందాం అన్నాడు. సరే దాంతో పాటు నేను foie gras ఆర్డర్ చేసాను. what is this మొహిద్దిన్ జి? అన్నాడు. నేను చెప్పా… ఇది french delicacy. Fattened గూస్ liver అని. మొఖం ఇబ్బంది గా పెట్టాడు. సరే ట్రై చేద్దాం అన్నాడు. Caviar రుచి చేసిన తర్వాత ఆ డబ్బా ను పరీక్షగా చూస్తే అది కాస్పియన్ సముద్రపుది అని తేలింది. ప్రీమియం క్వాలిటీ.(నాకు నచ్చలేదు) తర్వాత foie gras. కొంచెం రుచి చేశాము. slipperyగా , అంగుటికి అతుక్కునే లా అనిపించి పక్కన పెట్టేసి, Buffet లో ఏదో తిన్నాము. The way Emirates pampers FC passengers is unbelievable.
ప్రయాణం చేసి టెహ్రాన్ లో దిగాము. కార్ లో టెహ్రాన్ లో The Parsian Azadi Hotel కు వెళ్ళాం. Check ఇన్ లో నేను నా క్రెడిట్ కార్డు ఇచ్చాను. హోటల్ వాడు చీ పో అన్నాడు. కాష్ –యూరోస్ or డాలర్స్ అన్నాడు. బాసు జేబులో నుండి ఓ కట్ట తీసి అందులో నుంచి కట్టి రూమ్స్ కు వెళ్ళాం. రూమ్స్ లో ac పని చేయటం లేదు. ఏమిటిరా అంటే పవర్ కట్ మరియు జనరేటర్ రిపేర్ అన్నాడు. నాకు ఇండియా లో చిన్న ఊర్లలో హోటల్స్ గుర్తుకోచ్చాయి. కిటికీలు తెరిచి పడుకొన్నాను.( చాల రోజుల తర్వాత). పొద్దున్నే 11 గంటలకు డొమెస్టిక్ ఫ్లైట్ తో మషాద్ కు వెళ్ళాలి. , టాక్సీ లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాం. ఆ ప్లేన్ చూస్తే భయం వేసింది. లోపల సీట్లు చినిగి పోయి, లగేజ్ రాక్స్ లో లైనింగ్ ఊడిపోయి carpet లో చిరుగులు తో స్వాగతం పలికింది గగన కన్య with black robe with hijab .
Boeing stopped providing spare parts to all Iranian planes since 20 years అని పక్కన ఉన్న లాయర్ చెప్పాడు,. గుండె పోటు వచ్చినంత పని. ఓరి దేవుడా.. ఇది ఏమి పనిష్‌మెంట్ రా బాబు అని గుండె అరచేత్తో పట్టుకొని అలాగే 2 గంటలు బిగుసు కొని ఉండి పోయా. మషాద్ లో దిగాము. ప్లేన్ దిగి 30 అడుగులు వేస్తే టెర్మినల్. చిన్న సైజు రైల్వే స్టేషన్ లా ఉంది. బయట పడ్డాము. వెంటనే కార్ లు కూర్చొన్నాం. పోర్ట్ ఎంత దూరం అని అడిగా. అబ్బే 2 గంటలే అని అన్నాడు మా కాంటాక్ట్ . మధ్యలో ఏదో చిన్న హోటల్ లో chelo kabaab తిన్నాము. అది వాళ్ళ జాతీయ వంటకం అట.4 గంటలకు పోర్ట్ కు చేరాం. పోర్ట్ ఎంట్రీ లో మా పాస్పోర్ట్ లు లాక్కొని, మా ఫోటోలు తీసి , పది సంతకాలు చేయించుకొని లోపలి వదిలారు. వెళ్లి డైరెక్టర్ ను కలవాలి అంటే, అప్పాయింట్మెంట్ ఉంది అని confirm చేసుకొని ఫోన్ లో సెక్యూరిటీ ని తోడిచ్చి లోపలి పంపారు. ఆ సెక్యూరిటీ వ్యక్తి
Is from Iran revolutionary guards ( elite force of iran) అని మా లాయర్ చెప్పాడు. నాకు చెమటలు పట్టాయి.
సరే డైరెక్టర్ ఆఫీసు లోపలికి ఎంట్రీ.
( సశేషం)
