#పలుకు

హోలీ పండగ

మన తెలుగు లోగిళ్ళలో సుప్రసిద్ధం కానప్పటికీ, మన ప్రాంతాలలో కూడా ఈ పౌర్ణమినాడు కొందరు ‘హోలికా దహనం’ పేరిట ఇళ్ళముందు భక్తితో చితుకులు పేర్చి మంట చేయటం, నరసింహ స్వామిని కొలవటమనే ఆచారమున్నదంటారు, ఎరిగిన పెద్దలు. ఉత్తరాది రాష్ట్రాల వారిలోనూ, గత ముప్ఫైఐదు ఏళ్ళుగా నన్ను ఆదరించిన మహారాష్ట్రులకూ కూడా ఇది ఒక ముఖ్యమైన పండగ. సాధారణంగా వీధులన్నింటా
March 2, 2026
52 views

శివోఽహమ్

ఎదికి ఎదికి ఇక యాసిరికాయెరజీవము పులిసిపాయెయో శివిగాఅలసి సొలసి నే కునుకుల బడితోకలలల కలవరమాయయొ శివిగా నేను నేనంట బెమ్మము ఇస్నువుఆమట్న తన్నకలాడిరంటనే శివిగానీ మొదులూసివర జూసిరామనిలింగ రూపిగ వొస్తివంటయో శివిగా పుట్టిల్లు నాదని నీయాలి బోవగాసతికి అగమానమాయెనే శివిగాకచ్చగట్టి నువు జడను పెరికితేదక్స యగ్గెము ద్వంసమ శివిగా సురాసురులు దేవసుర కోసముఆగము ఆగమయిరంటనే శివిగాకడలి చిలుకంగ సిరినీ
February 15, 2026
95 views

రాజమ్మ

by
“ముసలిది ఇంకా ఎంత కాలం బ్రతుకుతాదో, చెయ్యలేక చస్తున్నా” అంటూ పక్క ఎక్కింది సుమిత్ర. ఏమమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం. ఆ ముసలిదీ ఆయనకు నానమ్మ పేరు రాజమ్మ, గత ముప్పై ఐదు ఏళ్ళుగా మంచాన పట్టి ఉంది. మాట రాదు, ఎవ్వరిని గుర్తుపట్టదు, ఒంట్లో ఏ అవయవం కదల్దు. ఒరిస్సాలో జయపూర్లో మెయిన్ రోడ్కు కుడి పక్క
December 30, 2025
44 views

అభీ నజావో ఛోడ్ కర్

by
అలెక్సాలో “అభీ నజావో ఛోడ్ కర్” అన్న పాట వస్తోంది. ఆ పాట విన్నపుడల్ల తనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. జయదేవ్నీ రఫీనీ ఆషాని మెచ్చుకోకుండా ఉండలేడు. అంత మధురంగా ఉంటుంది, గ్లాస్ లో సింగల్ మాల్ట్ వేసుకొని స్టూడియోలోని కుర్చీలో కూర్చొని ఆ ఆరు పెయింటింగ్స్ వైపే చూస్తున్నాడు. గిరీశం ఇప్పటికి 6 సార్లు వెయ్యటానికి
December 25, 2025
42 views

గమనం

by
అనిత, సుజాత, ప్రమీల, శైలజల స్నేహం చాలా బలమైనది. వాళ్ళ నలుగురి స్నేహాం ఆరో తరగతి విజయనగరంలో మొదలైంది. ఒకే బెంచ్ మీద నలుగురు కూర్చునేవారు. ఒకేసారి మధ్యాహ్నం భోజనానికి డబ్బాలు తెరిచేవారు, వారు తెచ్చుకున్న వాటిని పంచుకొని తినేవారు. ఆస్తిపాస్తుల్లో తేడాలు ఉన్నప్పటికీ పెద్దగా అభిప్రాయాలూ కానీ వాటి బేధాలు కానీ ఏమి లేవు వారిలో. పదో
November 1, 2025
32 views

“వస్తానన్నాడు”

by
బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది ప్రియ. నిశ్శబ్దం… గాలి కూడా కదలని నిశ్చలత. ఆకాశం మేఘాలతో కప్పబడి, చంద్రుడు, చుక్కలు కనిపించటం లేదు. వర్షం వస్తుందేమో అనిపించింది. కరెంటు పోయి, చుట్టూ చీకటి. గదిలోనూ అంధకారమే. ఇన్వర్టర్ పనిచేయక చాలా కాలమైంది. కొవ్వొత్తి వెలిగించాలన్న ఆలోచన కూడా రాలేదు. “వస్తానన్నాడు…”
September 23, 2025
44 views

మనసు తానై తానె నేనైంది నా పెంటి

సేను కాడ నేను సెమట గారుత వుంటేసెంగుతో తుడిసి నా అలుపు పోగొడతాదిసెలమ దడిసీ ఒల్లు సితసితామంటాంటెఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాదిఅరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపిముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాదిఅమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాదిఆలి ప్రేమకు ఇంగొక్క పేరు తానెలెమ్మంటాది గొంతు పొలమారితే నా సవితంటు నగుతాది గుండె తడిబారెనా తానె దిండై ఓదారుస్తాదినా ఇంటి ముంగిట్ల మావి
September 16, 2025
254 views

జయ జయ జయ శ్రీ వినాయకా

జయ జయ జయ శ్రీ వినాయకామమ్మెన్నడు కావవె వినాయకాగణరాయ జయము శ్రీ వినాయకాభక్తజన గణ రక్షక వినాయకా అంబ నలచె నలుగు శ్రీ వినాయకాసలుగు నిన్ను బడయగా వినాయకాగడప నిలిపి అయ్యను శ్రీ వినాయకాగజముఖధారి వైతివట వినాయకా అమ్మ యానతి నీకట శ్రీ వినాయకాఅబ్బ అబ్బొ యనంగదె వినాయకాశివ తాండవ కేళి నీవె శ్రీ వినాయకాగౌరి ముద్దు పట్టి
September 6, 2025
52 views

కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది?

కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది? #ఎవరికైనాతెలుసా? గజాసుర కుక్షి నుండి, కైలాసం రాబోతున్న శివయ్య కోసం వెణ్ణీళ్ళు రెడి చేద్దామంటే, గీజర్ పనిచెయ్యలేదు. కట్టెల పొయ్యిమీద, ఆ ఐసు కరిగి, వేణ్ణీళ్ళు అయ్యేవరకు టైం ఉంది కదా అని అమ్మవారు ఇక షాంపూ వద్దులే అనుకుని, కుంకుడుకాయలు కొట్టుకుని, నలుగు పెట్టుకుని, ఆ వలిచిన నలుగుతో
August 27, 2025
65 views

ఆకొన్న కూడె యమృతము

పూర్వం ధారా నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు కాపురముండేవాడు. భుక్తి గడచేది కాదు. కుటుంబపోషణార్థం యాచకవృత్తి నవలంబించినవాడు. రాజాశ్రయం పొందితే ధనధాన్యాలకు లోటుండదని ఎవరో సలహా ఇస్తే, ఆ ప్రయత్నం చేయాలని ఆశ. కానీ ఏమంత చదువు సంధ్యలున్నవాడు కాదు. అపండితుడు. మరి రాజ దర్శనమెలా? అదీ తాను చేరవలసింది మహారాజు భోజుని దర్బారు! ఏదైనా కవిత్వం రాసుకెళ్ళి
July 29, 2025
46 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog