కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది?

కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది? #ఎవరికైనాతెలుసా?

గజాసుర కుక్షి నుండి, కైలాసం రాబోతున్న శివయ్య కోసం వెణ్ణీళ్ళు రెడి చేద్దామంటే, గీజర్ పనిచెయ్యలేదు. కట్టెల పొయ్యిమీద, ఆ ఐసు కరిగి, వేణ్ణీళ్ళు అయ్యేవరకు టైం ఉంది కదా అని అమ్మవారు ఇక షాంపూ వద్దులే అనుకుని, కుంకుడుకాయలు కొట్టుకుని, నలుగు పెట్టుకుని, ఆ వలిచిన నలుగుతో ఒక పిండిబొమ్మ చేసారు.పిండిబొమ్మ తయారీలో ఇవి ఉన్నాయి – రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, వ్యర్థాల నుండి ఉత్తమంగా & కళ. ఇక్కడ “Law of Conversation of Mass”కి మించిన జ్ఞానం వస్తుంది. పిండిబొమ్మను బాలుడిగా మార్చడం – “నిర్జీవంగా నుండి జీవించడం” – అధునాతన వైద్య శాస్త్రం మరియు AI.

ఇప్పుడు. చక్కనైన బాలుడు ముచ్చటగా ఉన్నాడు. చెప్పిన పని తూ.చా. తప్పకుండా పనిచేస్తున్నాడు. ఇకక్కడే వచ్చింది చిక్కంతా. ఎందుకంటే, ఇద్దరి చిప్స్ లో డేటా సెట్ అప్-డేట్ అవ్వలేదు. పిల్లాడి విషయం. శివుడి కి, శివుడి వివరం పిల్లాడికి తెలియక, అబ్బాయి ఇ ఆదరించవలసిన శివుడు, తన ఇఘోస్టిక్ ఆగ్రహంతో పార్వతి దేవి సృష్టిని , ముద్దు బుడ్డడి కుత్తుక ఖండిస్తాడు. ఆ బాలుడి గుర్తింపు తెలియక శివుడు ఇంట్లోకి ప్రవేశించాడు.

ఆది దంపతుల అచ్చట్లు- ముచ్చట్ల మధ్యలో “ది బాయ్, హూ వజ్ బి-హెడెద్ ఎట్ ది డోర్!” టాపిక్ వచ్చింది. పార్వతిదేవి పుత్రశోకంతో వికవిలలాడింది. భార్యకు కలిగించిన మనోక్లేశానికి భర్త కళవళ పడ్డాడు. తానే, ధృవ-మార్కండేయులకి ఆయుష్-ప్రదాత అయిన శివుడిననే స్పృహ తెచ్చుకుని (దట్ మీన్స్, హీ రియలైజ్డ్, హౌ బిగ్ , హౌమాచ్ బిగ్గర్, హిజ్-హైనెస్స్ బిగ్గెస్స్ట్ బియో-సైంటిస్త్ హీ ఈజ్), ఆ గజాసురుని తల ఆ బాలుడికి అమర్చబడి అతన్ని బ్రతికించాడు. ఇదొక మెడికల్. మిరాకీల్, ఆర్గాన్ ఇంప్లాంటేషన్, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్-డేట్, – అదే జరిగింది.

ఆపైన జరిగిందంతా మీకు తెలిసినదే.

ప్రతి పురాణం వెనుకా సైన్సు ఉంది.

ఇహ పూజ చేసుకుని, అక్షింతలు జల్లుకుని, పిండి వంటలతో భోజనం చేసి, విశ్రాంతి తీసుకోండి!

సర్వేజనా సుఖినో~హ్భవనంతు!

2

4 Comments Leave a Reply

  1. లేట్ గా చదివినా లేటెస్ట్ గా అందుకున్నాను ఈ
    కైలాసం లో కరంట్ పొతే ఎమ్ జరిగింది అన్న గణేష్ చతుర్థి స్పెషల్ పోస్ట్

  2. వినాయకుడి పుట్టుకకు సంబంధించిన పౌరాణిక గాథను ఆధునిక శాస్త్ర సాంకేతిక అంశాలతో ముడిపెట్టి, ఎంతో సృజనాత్మకంగా వివరించారు. 👏

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

గాజు కిటికీ – రెండు ప్రపంచాలు

A view from my Office window నీలాకాశం, నీరు, చల్ల గాలి

ఏ జన్మ ఋణమో

సీతాపురంలోని రామాలయం వీధిలో రామలక్ష్మమ్మగారు అనే ఆవిడ తన ఒక్కగానొక్క కొడుకూ ఉంటుండేవారు.