1982 ఆగస్ట్.
మా బ్యాంక్ గుంపు అందరం అమర్నాథ్ యాత్ర వెళ్దాం మనుకొన్నాం.
నేను,హరీష్,సింగు,రెడ్డి,ముష్టాక్,అరోరా,రవీందర్ శనివారం 5pm కు బయలు దేరి మరల ఆదివారం రాత్రికి వచ్చేద్దాం అని ప్లాను.నా దగ్గర ,సింగు దగ్గర సేఫ్ తాళాలు.మేనేజర్ ఊళ్ళో లేరు. కాబట్టి ఆయన తాళాలు కూడా నా దగ్గరే.ఒక వేళ సోమవారం బ్యాంక్ తీయకపోతే ఇక అంతే సంగతులు.ఉద్యోగాలుహుళక్కే !!
ఇక బయలు దేరాం. సోన్ మార్గ్ వెళ్లే సరికి చీకటి పడింది. లారీ లో అక్కడ నుండి బాల్తాల్. రోడ్డు అంతా మిలిటరీ వారి అధీనం.బాల్తల్ చేరే సరికి శనివారం 930pm. విపరీతమైన చలి.నో తిండి. వర్షం మొదలు. ఓ మిలిటరీ truck లో తల దాచుకొన్నాం. వర్షం తగ్గింది. రాత్రి1 గంట అయింది. ట్రెక్ చేద్దాము ..కొంచెం వెన్నెల ఉంది అని డిసైడ్ అయ్యాం.
15km మాత్రమే .. ఓ సోస్.అని జాకెట్లు,మఫ్లర్లు బిగించి, వగరు పానీయం సేవించే వారు , దాన్నిసేవించిన తర్వాత బయలుదేరాం.
it’s a treacherous trek. ఏ మాత్రం అజాగ్రత్తగా కాలు స్లిప్ అయితే శాల్తీ కనబడదు. నాకు కాళ్ళు వణుకుడు.చేతి కర్రసాయంతో నడక. తొందరగా నడవడం వల్ల హైట్ కు వెళ్ళే కొద్దీ తలనొప్పి స్టార్ట్ అయింది.
మేము 6 గంటలు ట్రెక్ చేసిన తర్వాత ఒక కొండ plateau దగ్గర చైనా బోర్డర్ 10km అనే బోర్డు చూసాం.హైట్ 13400ft.
మజిలీల్లో నేను తీవ్రమైన తలనొప్పి తో బాధపడ్డా. ఆగిపోలేను. విడిచి వెళ్ళలేను. అలాగే కంటిన్యూ చేశాను
దారిలో 8 నుండి 80 yrs వాళ్ళని చూస్తే, faith alone drives them అనిపించేది. చివర 2 కీమీ A very thick sheet of ice. కూర్చొని చెవిపెట్టి వింటే క్రింద నది హోరు వినపడింది.
అక్కడ గోచీ మాత్రమే పెట్టుకొని వీభూది రాసుకొని నించుని ధ్యానం చేసే వాళ్ళను చూసాను. ఎలా body react అవుతుందో..?
అక్కడ ఉన్న హిమలింగం హైట్ చంద్రుని సైజ్ హెచ్చు తగ్గులతో బాటు మారుతుందని అంటారు. దర్శనం చేయాలంటే షూస్ తీయాలి. Socks తో దర్శనం. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి చలికి. ఫోటోలు తీసుకొని లంగర్ కు వెళ్ళాము.
పారుతున్న స్వచ్ఛమైన నీళ్లు, తాగాలని ఉన్నా తాగలేని పరిస్థితి , అంత చల్లగా ఉన్నాయి. పూరి గుమ్మడికాయ కూర ఇచ్చారు. అసలు గుమ్మడి కాయ ముట్టని నేను,అలసి సొలసి ఆకలి మీద ఉన్నానేమో ఆ కూర అతి రుచికరం అనిపించింది. 5 పూరీలు లాగించి,బాగా కష్టపడి నీళ్లు తాగి బయలు దేరాం. ఆప్పటికే 12 గంటలయింది. 6/7 గంటల ట్రెక్. కొంచెం దూరం వెళ్ళగానే నా కుడి కాలి muscle పుల్.
ఇక నావల్ల కాదు అని నేనంటే, సరే “పోనీ ” పై కూర్చో..వెళ్దాం అని అన్నారు.బేరమాడి గుర్రం ఎక్కించారు..అదే జీవితం లో గుర్రం ఎక్కటం.13000 ft ఎత్తులో..ఇక చూస్కోండి…
గుర్రం ఎక్కాను.ఎంటోడు పాత సినిమాలో చేసినట్టు స్వారీ కాదు.మెల్ల మెల్ల గా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. ముందు దాని కళ్లెం పట్టుకొని గుర్రం ఓనరు. బాగానే సాగుతుండగా…హఠాత్తుగా గుర్రం సకిలించి,ముందు కాళ్ళు ఎత్తింది. అసలే ఫస్ట్ టైమ్.బ్యాలన్స్ తప్పి నేను కింద పడినప్పుడు పెట్టిన కేక ఎదో జంతువు చేసిందా అనిపించిందట.నా శ్రీమతి అదృష్టం బాగుండి నేను ఆ సన్నటి దారిలో కొండ ఉన్న వైపు పడ్డాను. ఒక వేళ అటువైపు పడిఉంటే ఇది వ్రాసి ఉండేవాణ్ణి కాదు.
అసలు కళ్ళు విప్పితే ఒట్టు.10 నిమిషాలు ఒళ్లంతా వణకటం.అందరూ గుమి గూడారు.కిం కర్తవ్యం?
నేను గుర్రం ఎక్కను అని మొండి కేసా..గుర్రం ఓనర్ డబల్ భరోసా ఇచ్చిన తర్వాత మళ్లీ ఎక్కా. ఎలాగోలా బాల్తల్ వచ్చి పడ్డాం.సాయంత్రం 7 గంటలయింది. Sonmarg వెళ్ళాలి. బస్సులు లేవు..లారీ పట్టుకొని కిందా మీదా పడి 930 pm కి sonmarg చేరాము. అక్కడా అంతా నిర్మానుష్యం. నో తిండి.ఒక్క దుకాణం లేదు.చలిభయంకరం.రోడ్ మీద పడిగాపులు.
40 ఏళ్ల ముందు అలాంటి చోట్ల transport ఎందుకు లేదో ఇప్పుడు ఊహకు అందదు.
ఒక 5 లారీలు ట్రై చేశాం.లిఫ్ట్ కుదర్ల.
రాత్రి 12 అయిపోయింది..పొద్దున్నే బ్యాంక్ ఓపెన్ చేయాలి.లేకపోతే ఉద్యోగాలకు ఎసరు. ఆ టెన్షన్ లో నలిగిపోయి, ఓపిక నశించి ,నీరసం ఆవహించి, దురదృష్టం వెక్కిరిస్తున్నప్పుడు, ఓ లారీ ఆగింది.Tata 1210 S. అప్పటికే కేబిన్ లో ఇద్దరున్నారు. మేము ఏడు గురం. ఎలాగోలా ఎక్కాం. డ్రైవర్ కాలాంతకుడు. విఠలాచార్య సినిమాలో ఏంటోడు గుర్రం స్వారీ చేసినట్లు స్టీరింగ్ తిప్పటాలు+భయంకరమైన స్పీడ్.
ఆ ఘాట్ రోడ్లలో దైర్యం చాలక నేను దేవుడి పై భారం వేసి కళ్ళు మూసుకున్నా. ఒక చోట బ్రేక్ వేశాడు..అందరి తలలు క్యాబిన్ కు గుద్దుకొని ఫట్ మన్నాయి. ఓ పెద్ద dead end. రివర్స్ తీసుకొని డ్రైవర్ రోడ్డు ఎక్కాడు. నా ప్రాణాలు గొంతులో కొచ్చాయ్. మొత్తానికి గుండెలు అరచేతిలో పెట్టుకొని శ్రీనగర్ చేరేసరికి తెల్లారి 3 గంటలయింది. కుంటుకుంటూ ఇంట్లో కి వెళ్ళాను.
పడుకొని మరల 9 కి ఆఫీస్.ఆఫీస్ నుండి రాగానే ఎందుకు కుంటుతున్నారు? అని శ్రీమతి. ఎదో చెప్పబోయి తప్పించుకుందాం అనుకొని,వద్దులే అని నిజం చెప్పా(గుర్రం,స్వారీ,పడిపోవటం వగైరా).
ముక్కు చీదుల్స్,సైలెంట్ ఏడుపులు,మీరేమన్నా బ్రూస్ లీ యా? ఎందుకొచ్చిన పిల్ల చేష్టలు? ఏ మాత్రం బుద్ధి,జ్ఞానం ఉందా? ఎదైనా అయితే దిక్కెవరు? వగైరా అక్షింతలతో రెండు రోజులు రిపీట్ పెర్ఫార్మెన్స్..
నేను బామాలి, ఒట్లు గట్రా వేసి,బతిమిలాడి,ఇంకెప్పుడూ చెయ్యను అని promise చేస్తే నా భార్యామణి శాంతించింది.
నాకు బుద్ధి వచ్చి అటువంటి సాహసాలు మరల చెయ్యలేదు..
అదీ నా అమర్నాధ్ యాత్ర!