మాక్ ఓయస్‌లో తెలుగులో టైప్ చేయడం ఎలా ?


మీ మాక్లోని ఆపిల్ లోగో పైన క్లిక్ చేసి సిస్టం సెట్టింగ్స్ ఎంచుకోండి.

తరువాత సిస్టం సెట్టింగ్స్లో కీ బోర్డును ఎంచుకోండి

తరువాత టెక్స్ట్ ఇన్పుట్ సోర్సెస్లో ఇంగ్లీషుతో పాటు తెలుగు ట్రాన్స్లిటరేషన్ ఎంచుకోండి. కింద బొమ్మలో హైలైట్ చేసిన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు తెలుగు, ఇంగ్లీష్ కీ బోర్డుల మధ్య సులువుగా మారవచ్చు.

ఇప్పుడు మీ మెనూ బార్లో ఇంగ్లీషుతో పాటు తెలుగు కీ బోర్డు కూడా కనిపిస్తుంది.

ఇప్పుడు మీకు నచ్చిన అప్లికేషన్ తెరచి అందులో మీరు ఎప్పుడూ టైప్ చేసినట్టు తెంగ్లీషులో టైప్ చేస్తే దానంతట అదే తెలుగులోకి లిప్యంతరీకరణ చెందుతుంది.

ఇక పై మీరంతా మన అందమైన తెలుగులో వ్రాయాలని ఆకాంక్షిస్తూ…

—- సాయి కౌలూరి

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

Courage to Dream Beyond One’s Lifetime

This tweet recently provoked me to articulate thoughts that have

After UNIV.

1974 June I stepped into real world after my scholastic