Sai Kowluri

వికృతభోజుని వృత్తాంతము

పూర్వం నైమిశారణ్యంలో వికృత భోజుడు అనే దానవుడు బ్రహ్మవరం పొందాలని ఘోరమైన తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకి మెచ్చి ఒక నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, “నాయనా, నీ తపస్సును మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు”. అందుకు ఆ దానవుడు, దేవా నేను భోజన ప్రియుడను. నీ వరం పొందాలని సవిరామ ఉపవాసం చేస్తూ,
November 23, 2025
11 views

ఐ ఫోన్లో తెలుగులో టైప్ చేయడం ఎలా?

మీ ఐఫోన్లో సెట్టింగ్స్ తెరచి జనరల్ -> కీ బోర్డ్ దగ్గరకి వెళ్ళండి. ఇప్పుడు తెలుగు ( అక్షరమాల ) కీ బోర్డుని జోడించండి. తెలుగు అక్షర మాల కీ బోర్డుని జోడించాక, మీకు కుడి పక్కన “క” అని తెలుగు కీ బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన అప్లికేషన్లో ఎప్పటిలానే తెంగ్లీషులో టైప్ చేస్తే తెలుగు
August 15, 2025
78 views

మాక్ ఓయస్‌లో తెలుగులో టైప్ చేయడం ఎలా ?

మీ మాక్లోని ఆపిల్ లోగో పైన క్లిక్ చేసి సిస్టం సెట్టింగ్స్ ఎంచుకోండి. తరువాత సిస్టం సెట్టింగ్స్లో కీ బోర్డును ఎంచుకోండి తరువాత టెక్స్ట్ ఇన్పుట్ సోర్సెస్లో ఇంగ్లీషుతో పాటు తెలుగు ట్రాన్స్లిటరేషన్ ఎంచుకోండి. కింద బొమ్మలో హైలైట్ చేసిన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు తెలుగు, ఇంగ్లీష్ కీ బోర్డుల మధ్య సులువుగా మారవచ్చు. ఇప్పుడు మీ
August 15, 2025
23 views

మన రైలు ప్రయాణం

ఏదో ఖాళీ రైలు బోగిలో కిటికీ పక్కన నువ్వు నీ పక్కన నేను ఆ కిటికీలోంచి నిన్ను చూసి పరవశించిపోతున్న కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఎగిరే పక్షులు, కేరింతలు కొట్టే పిల్లలు ముత్యాల్లా నా చెంపల మీద చిందే నీ కనుసన్నల నుంచి దూసుకు వచ్చే కంట నీరు నా అరచేతిని గట్టిగా కౌగిలించుకునే నీ అరచేతులు
August 3, 2025
42 views

మళ్ళీ పెళ్లా ..

ధాతా నామ సంవత్సరం, శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ల కాలం. నేను ఐదో తరగతి చదువుతున్న రోజులు. కాకినాడలో ఉన్న మా బామ్మా వాళ్ళ చెల్లెలి మనవరాలు పెళ్లి. అమ్మా నాన్న, బామ్మ తాతయ్య, నేను తమ్ముడు, అందరం పెళ్ళికి బయలుదేరాం. రెండు బల్ల రిక్షాలు మాట్లాడుకుని, కుటుంబమంతా కొత్త బట్టలు, దారిలోకి మరెయ్యడానికి చిరుతిళ్ళు,
August 2, 2025
21 views

ఏ జన్మ ఋణమో

సీతాపురంలోని రామాలయం వీధిలో రామలక్ష్మమ్మగారు అనే ఆవిడ తన ఒక్కగానొక్క కొడుకూ ఉంటుండేవారు. రామలక్ష్మమ్మగారి భర్త కొన్నాళ్ల క్రితమే కాలం చేశారు. కట్నంగా ఆవిడ తెచ్చిన పొలం కౌలుకిచ్చి, పాలు, పెరుగు అమ్ముకుంటూ బ్రతుకు బండి లాక్కొచ్చేవారు. భర్త పోయినప్పటి నుంచి రామలక్ష్మమ్మగారు రాముని సేవలో కాలం గడిపేవారు. గుడి, పాడి తప్ప వేరే లోకం ఎరుగదు. గుడి
August 2, 2025
20 views

నిశ్రేణి పై నీలవేణి

ఈ కథలోని పాత్రలు కొందరిని పోలి ఉండవచ్చు, ప్రదేశాలు చూసినవిలా ఉండవచ్చు, వస్తువులు ఎప్పుడో వాడినవిలా ఉండవచ్చు. చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రభుదేవా అని, వారి చేతలే నా చిట్టి కథలు. ఆనందో బ్రహ్మ గోవిందో హార్ … నా పేరే ప్రేమ నీ పేరే ప్యార్…. అని పక్కింట్లో కఱ్ఱ బిళ్ళ ఆడుకుంటున్న కుర్రాడికి వినిపించేలా పెద్ద
August 1, 2025
57 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog