మన రైలు ప్రయాణం


ఏదో ఖాళీ రైలు బోగిలో

కిటికీ పక్కన నువ్వు

నీ పక్కన నేను

ఆ కిటికీలోంచి నిన్ను చూసి పరవశించిపోతున్న కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఎగిరే పక్షులు, కేరింతలు కొట్టే పిల్లలు

ముత్యాల్లా నా చెంపల మీద చిందే నీ కనుసన్నల నుంచి దూసుకు వచ్చే కంట నీరు

నా అరచేతిని గట్టిగా కౌగిలించుకునే నీ అరచేతులు

అప్పుడప్పుడు నా చేతులను పొదుముకునే నీ గుండెలు

పొద్దుగూకే ఆ సూర్యుడిని చూస్తూ నా భుజాన్ని తలగడ చేసుకునే నువ్వు

ఈ ప్రపంచం, ఈ ఆనందం, ఈ రోజు, ఈ నిమిషం, ఈ క్షణం ఎంత శ్రద్దగా వ్రాసాడో ఆ దైవం.

జీవిత కాలం సాగితే బాగుండు మన ఈ రైలు ప్రయాణం.

2 Comments Leave a Reply

Leave a Reply to Ghouse Hyd Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

Embrace

హిందీ పాటలు -లిరిక్స్

Roman Script Hamne Dekhi Hai Un Aankho Ki Mehekti KhushbooHaath