
గౌరీ ప్రియసుత శంకర మోదక
షణ్ముఖ భ్రాతా వినాయకా
మూషిక వాహన జనగణ వందన
గజముఖ రాయా వినాయకా
శ్రీకర శుభకర త్రిజగోద్ధారక
లోకపాలకా వినాయకా
దుష్ట సంహారక దురిత నివారక
విశ్వరక్షకా వినాయకా
ప్రథమ పూజితా ప్రాజ్ఞ వందితా
బ్రహ్మాండ నాయక వినాయకా
పాశాంకుశధర పన్నగ భూషిత
సర్వమంగళ కారక వినాయకా
రావణ బాధక శశాంక విదారక
త్రిగుణ రూపకా వినాయకా
సిద్ధి ప్రసాదక బుద్ధి ప్రచోదక
మోక్షదాయకా వినాయకా
మోదక భక్షక పరిజన రక్షక
పరతత్వ బోధకా వినాయకా
దుర్జన భంజక దుర్మతి ఘాతక
సకల సిద్ధి ప్రదాయక వినాయకా
త్రిభువన అర్చిత అభీష్ట ప్రదాతా
ఆర్త జన రక్షక వినాయకా
విశ్వరక్షాకృత లోకత్రయీ స్తుత
విమల వేద వందితా వినాయకా
వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #వినాయకచవితి, #ఆధ్యాత్మికం, #భక్తి, #కవిత
@vennela

🙏
త్రిభువన అర్చిత అభీష్ట ప్రదాతా….. కదా??
వాట్ ఆర్ యువర్ అభీస్టమ్స్ ?
అచ్చ తెలుగులోనే అడిగారా? లేక మీ కెంతో ప్రీతిపాత్ర మైన కిలిబిలి భాష లో అడిగారా?
అయినా.. దేవుడిని ఎలా పిలిచినా పలుకుతాడంటారు కదా !
పాలు స్టౌ పై పొంగించే నేర్పరితనం ప్రసాదించమని అడిగారని అభిజ్ఞ వర్గాల భోగట్టా..
మీకు అరుణమ్మ గార్కి బోలెడు శుభాకాంక్షలు.. పండిత పుత్రుడికి కూడానూ….
ఇట్లు మిత్రపరమాణువు — గౌసు
మంగళ మహత్ శ్రీ శ్రీ శ్రీ – పవర్ ప్రెస్ – ఏలూరు ( పాత రోజుల్లో శుభలేఖలలో ఈ పదాలు ఉండేవి)