
జీవి తన చిత్తం తో విత్తం మరియు అంతకంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయాలని గ్రహించే ప్రక్రియే జీవితం అంటే ..
జీవితమంటేనే ఉగాది పచ్చడి కూడానూ
ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో సినీకవులు ఏమి చెప్పారో అని చూస్తే పోలా, మీ మూడుని బట్టి మీకు ఇక్కడ లిస్ట్ చేయపడ్డ వివిధ పాటలతో మీకు ఒక కనెక్షన్ ఏర్పడచ్చు. అంటే షడ్రుచులు మరియు నవరసాలు ఆస్వాదిస్తేనే కదా తెలిసేది వర్ణన కన్నా.
పాటలన్నీ మొదటి/రెండు చరణాలలో ఎక్కడో అక్కడ జీవితం లేదా జీవన, బ్రతుకు అన్న మాట (లేదా అలాంటి అర్ధం) వస్తే అది ఒక పాపులర్ పాట అయితే దాన్ని ఈ కూర్పు లోకి చేర్చాను, ఈ పాటలన్నీ క్రానోలోజికల్ ఆర్డర్ లో అంటే పాత పాటలు ముందుగా లిస్ట్ చేస్తున్నాను. ముందుగా తెలుగు పాటలు – ఆ తర్వాత హిందీ పాటలు కూడా లిస్ట్ చేస్తున్నాను, హిందీ లో కూడా జీవన్ లేదా జిందగీ అన్న మాట లేదా అలాంటి అర్ధం వస్తే దాన్ని ఈ క్రింది కూర్పు లో కి చేర్చుకున్నాను
ప్రస్తుతానికి తెలుగు లో ఒక 37 పాటలు మరియు హిందీలో 34 పాటలు ఈ కూర్పు లో కి చేరాయి ! ఇంకా ఏవైనా తడితే వీటిలోకి చేరుస్తాను (It will be in Chronological Order)
Telugu List
దేవదాసు ( 1953) లో
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే
బ్రతుకింతేనులే బ్రతుకింతేనులే
అనార్కలి (1955)
జీవితమే సఫలమూ రాగ సుధా భరితమూ
ప్రేమ కథ మధురమూ
శబాష్ రాముడు (1959) లో
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా (ఇందులో జీవితం అన్న మాట లేకపోయినా దాదాపు అదే అర్ధం వచ్చే మోటివేషనల్ లిరిక్స్ వున్నాయి)
వెలుగునీడలు (1961) లో
కలకానిది విలువైనది బ్రతుకు
కన్నీటి ధారలకే బలిచేయకు
గుడిగంటలు (1964) లో
జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతకు సమరంలో అలిసిపోయితిరా అన్న పాట
(ఇది కొంచం నిరాశ నిస్పృహ అనే కోణాల్లో ఉంటుంది)
లక్ష్మీ నివాసం (1966) లో
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం (యశ్వీ రంగారావు గారి పాట)
రంగుల రాట్నం (1966) అనే సినిమాలో టైటిల్ సాంగ్
జీవితమంటే అంతులేని ఒక పోరాటం
సంబరాల రాంబాబు (1970) లోనిది (ఇందులో చలం హీరో )
ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం
అనుభవించరా
అన్న లైన్స్ తో శ్రీమంతుడు (1971) మూవీ – అక్కినేని గారి స్టైల్ లో
వాగ్దానం (1971) లో
బంగరు నావా బ్రతుకు బంగరు నావా
కలెక్టర్ జానకి (1972) లో
జీవితమే ఒక ఆట అది వెలుగు నీడల సయ్యాట అనే ఒక ముక్క (ఇది ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పచ్చు )
ఈ లైన్స్ మొదట్లో రాదు కానీ మధ్యలో వస్తుంది – కానీ ఇవే మెయిన్ లైన్స్
విచిత్రబంధం అన్న సినిమా(1972) లో
అందమైన జీవితమూ అద్దాల సౌధమూ
అన్న లైన్స్ తో
జీవన తరంగాలు (1973) లో
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికీ ఎవరూ సొంతమూ ఎంతవరకూ ఈ బంధమూ
నిప్పులాంటి మనిషి (1974) మూవీ లో
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం – సీనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కోసం
రెబెర్ స్టార్ కృష్ణం రాజు గారి పాట అమరదీపం (1977) లోది
నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది
గోరంత దీపం (1978) మూవీ లో టైటిల్ సాంగ్ – ఇది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే (ఇందులో జీవితం అన్న పదం లేకపోయినా మొత్తం సాంగ్ అంతా జీవితం పైన దృక్పధం కోసమే కదా)
దీపారాధన అన్న మూవీ(1980) లో తెల్లకాగితం మనిషి జీవితం అన్న పాట శోభన్ బాబు గారి ఫాన్స్ కోసం
ఓ బాటసారీ ఇది జీవిత రహదారీ
ఎంత దూరమో ఏది అంతమో
అన్న ఈ పాట ఇల్లాలు (1981) సినిమాలో
ప్రేమాభిషేకం (1981/82) లో నించి కూడా ఒక పాట
ఆగదు ఏ నిముషం నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము
ముందుకు సాగదు ఈ లోకము (గమనిక : జీవితం అన్న పదం లేకపోయినా – నువ్వు మరియు లోకం అన్న పదాలు వున్నాయి కదా )
పచ్చని కాపురం (1985) లో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి గారి సినిమా లో
వెన్నెలైనా చీకటైనా నీతోనే జీవితం
సుమంగళి (1989) లో
జీవితం ఓ ప్రయాణం – నిండుగా సాగనీ
కొండవీటి దొంగ (1990) లో
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
మెగా స్టార్ శైలి లో (రాబిన్ హుడ్ స్టైల్)
ఇలా మరిన్ని తెలుగు పాటలు – ఇప్పుడు మచ్చుక్కి కొన్ని హిందీ పాటలు కూడా
HINDI LIST
జీవన్ కి సఫర్ మే రాహీ
మిలితేహ్ బిఛడ్ జానెకో
ఔర్ దేజతేహ్ యాదే
తన్హాయి మెయిన్ తడపానెకో
మునీంజీ (1955) లో పాట
దీని అర్ధం భలే వుంది –
జీవితపయనంలో తోటి ప్రయాణీకులు కలుస్తూ వుంటారు
వెంటనే విడిపోతారు కానీ వారి జ్ఞ్యాపకాలు మాత్రం మనల్ని వంటరితనంలో చుట్టు ముడతాయి
మధుమతి (1958) లో
సుహానా సఫర్ హై యెహ్ మౌసమ్ హసీ
అనారీ (1959) లో
జీనా ఐసీ కా నామ్ హాయ్ అన్న మాటలో చరణం పూర్తి అయ్యే పాట
హమ్ దోనో (1961) సినిమా లో ఇంకో దేవానంద్ పాట
మెయిన్ జిందగీ క సాథ్ నిభాతా గయా
హర్ ఫికర్ కో ధువా మెయిన్ ఉడాతా గయా
అస్లీ నకిలీ (1962) లో
తుఝే జీవన్ కా దోర్ సే బాంద్ లియాహై
(మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది .ఇదంతా ఒకప్పుడు తెలుగు కోరాలో కూర్పు చేసినదే. మొదటి రెండు లైన్స్ తో పాటు గా యూట్యూబ్ లింక్ తో తెలుగు కోరా లో ఇదివరకే కూర్పు చేసిన లంకె క్రింద జత చేయబడింది)
