1974 లో నాకు పెళ్ళి అయింది.మా నాన్న గారికి మేడపాడు స్టేషన్ కు ట్రాన్స్ఫర్.అక్కడకు రోజూ న్యూస్పేపర్ కూడా వచ్చేది కాదు ఒక ఏడాది గడిచింది… ఉద్యోగం లేదు.అయోమయం లో కొట్టు మిట్టాడుతున్నా.
కొన్నాళ్ళు ఈ ఈతి బాధలు తప్పించుకోవాలని JNU లో ఉన్న సత్య దగ్గరికి ప్రయాణం.ఒక చిన్న breifcase,మూడు జతల బట్టలు, ఓ షాల్.
JNU సట్లేజ్ హాస్టల్ లో మనం వాడి సింగిల్ రూం లో గెస్ట్. తిండి గట్రా మేస్ లోనే.JNU environs సింక్ అవ్వటానికి రెండు రోజులు.
ఆ తర్వాతి రోజు:
స: గౌసు plan ఏంటి?
నే: నీతో బాటే లైబ్రరీ కు వస్తా.
స: ఢిల్లీ లో చాలా ఉన్నాయి.ఎక్కడకు వెళ్దాం?
నే: మాంచ్ఛి లైబ్రరీ కు వెళ్దాం.
స: సరే తీన్ మూర్తి కు వెళ్దాం.
నే: నాకు పాస్ కావాలేమో కదా ? ఎలా?
స: ఒక పని చేద్దాం ప్రో.శేషాద్రి గారిని కలుద్దాం.
ప్రో.శేషాద్రి: హెడ్ /Pol.Sc Dept/JNU. దేశం లో బాగా పేరెన్నికగొన్న ప్రొఫెసర్
సరే అనుకోని ఆయన దగ్గరకు వెళ్ళాం.నన్ను సత్య పరిచయం చేశాడు.ప్రో. గారు నన్ను చూసి ఎందుకు తీన్ మూర్తి వెళ్ళాలి? what is the need? అని గర్జించారు.
నే: Sir,I want to spend time reading some books rather than sight Seeing.
ప్రో : What do you want to read ?
నే : Events of Independence.
సరే అని.. నా చదువు సంధ్యలు గురించి కనుక్కొని, ఆయన తన letterhead మీద తీన్మూర్తి లైబ్రేరియన్ కు లెటరు లో నాకు టెంపరరి పాస్ ఇమ్మని రికమండ్ చేశారు.
రోజూ బస్ JNU హాస్టల్స్ నుండి బయలు దేరి అన్ని టాప్ లైబ్రరీస్ కు వెళ్లి మళ్ళీ ఈవెనింగ్ return trip లో ఆయా లైబ్రరీల నుండి pick up చేసుకొనే సౌలభ్యం. Packed శాండ్విచ్ లంచ్ సంచి లో.
Teenmurthi లైబ్రరీ లోకి ఎంట్రీ..
కళ్ళు చెదుర్స్. ఫస్ట్ టైం AC లైబ్రరీ,. లోపలికి వెళ్ళి టెంపరరీ కార్డు తీసుకొన్నా.బాత్రూమ్ లు కూడా AC. నాకు అదో వింత.
లైబ్రేరియన్ దగ్గరకు వెళ్ళి నాకు 1947 Aug 15 newspapers కావాలి.ఇంగ్లీష్ & తెలుగు అని అడిగాను.
అతను నన్ను ఓ పాలి చూసి,ఇంక్ పెన్ not allowed అని బాల్ పెన్ ok అని చెప్పి, తనతో రమ్మనాడు.
ఓ అల్మైరా తెరచి చిన్న మైక్రో ఫిల్మ్ స్పూల్ ఇచ్చాడు. నా ఆశ్చర్యం చూసి, ఫస్ట్ టైమా? అని అడిగి ఎలా ఆపరేట్ చేయాలో చూపించాడు. screen పై మొత్తం పేపర్ పేజీ actual size ది కనబడుతుంది.మెల్లగా హ్యాండిల్ తిప్పితే పేజీలు కదులుతాయి. అలా ఒక వారం అన్ని పేపర్ లు ఔపోసన పట్టాను. అవి చదివి ఎవరెస్టు ఎక్కినంత ఫీల్ అయ్యాయా. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవ్వరికి లభ్యం కానీ 1947 ఆగస్టు 15 నాటి పేపర్లు చదివానని కాబోలు.
తర్వాత కాశ్మీర్ రాజా Hari Singh,Patel,Nehru ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలు, మౌంట్బాటెన్ correspondence విత్ జిన్నా,etc అంతా చదివాను.—అలా ప్రీ 1947 చరిత్ర కళ్ళ ముందు..గిర్రున తిరిగింది. చాలా నోట్స్ రాసుకొన్నా..ఎందుకో తెలియదు.
ఒక రోజు నేను సత్య లైబ్రరీ లో కూర్చుని ఉండగా అందమైన అమ్మాయి వచ్చి హాయ్ సత్య అని షేక్ హండ్ ఇచ్చి కూర్చుంది. నాకూ పరిచయం అయింది. అలా అలా ఎదో టాపిక్ పై వాదన /డిస్కషన్…నాతో argue చేసిన తర్వాత ఆ అమ్మాయి నేను ఎక్కడ చదివానని కూపి లాగింది.మనం zph స్కూల్ అన్నాను… ఆ అమ్మాయి St.Stephen’s .Top pedigree. . నాకు పెళ్లి కూడా అయిందని విని దిగ్బ్రమ చెందింది.
తనతో సమానం గా ఏదో టాపిక్ పై సమానంగా డిస్కస్ /వాదన చేసినందుకు బోలెడు ఆశ్చర్య పడిపోయి,నేనున్న ఆ రెండు నెలలు మంచి ఫ్రెండ్ అయింది. మంచి జ్ఞానం,తర్కం,భాషా పటిమ,అందం అన్నీ కలబోసిన ఆ అమ్మాయి UP home secy కూతురు. నేను,సత్య,ఆ అమ్మాయి,వేరే ఫ్రెండ్స్ – అందరం గంటల తరబడి ఏవేవో డిస్కషన్స్..ఒక్కో సారి రాత్రి 2 గంటల వరకు.
ఆ తర్వాత సప్రు హౌస్ లైబ్రరీ, IIPA లైబ్రరీ,ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లైబ్రరీ , JNU లైబ్రరీ అన్నీ నాకు బాగా పరిచయం అయ్యాయి. ఆ రెండు నెలల్లో,నేను కుతుబ్ మినార్ కూడా చూడలేదు.అసలు ఏమీ చూడకుండా అకాడమిక్, scholastic ఎన్విరాన్మెంట్ లో గడిపేశా. JNU వెళ్ళలేదనే బెంగ కొంచెం తీరింది.
కానీ జీవితంలో కోల్పోయిన వాటిల్లో మొట్ట మొదటిది — JNU లో PhD చేయకపోవటం.
అలా జరిగింది నా మొదటి డిల్లీ ప్రయాణం.
PS: కట్ చేస్తే 1986 లో ప్రొ. శేషాద్రి గారు నల్లకుంటలో ఎదో పని పడి నా బ్రాంచ్ కు వచ్చారు. మరల ఆయన తో భేటీ.
ఓ వారం తర్వాత నన్ను వాళ్ళింటికి లంచ్ కు ఆహ్వానించారు.