Chaudvi ka chand ho -Rafi-Shakeel-Ravi
चौदवीं का चाँद हो या आफ़ताब हो?
जो भी हो तुम ख़ुदा की क़सम, लाजवाब हो
పున్నమి చంద్రవదనమా లేక సూర్య బింబమా ?
ఏమైనా గాని,నీవు అసమాన సౌందర్య వతివి
ज़ुल्फें हैं जैसे काँधों पे बादल झुके हुए
आँखें हैं जैसे मय के प्याले भरे हुए
मस्ती है जिसमें प्यार की, तुम वो शराब हो
కురులు భుజాల పై వాలిన మేఘం లా
నయనాలు నిండైన మధు పాత్ర లా
ప్రేమ రంగరించిన మధువు లా
चेहरा है जैसे झील में हँसता हुआ कँवल
या ज़िंदगी के साज़ पे छेड़ी हुई ग़ज़ल
जान-ए-बहार, तुम किसी शायर का ख़्वाब हो
ముఖారవిందం సరస్సు సరస్సు లోని వికసిత పద్మమా
బతుకు వీణపై పలికించిన గీతమా
వసంత రూపమా.. కవి స్వప్నమా ..
होंठों पे खेलती हैं तबस्सुम की बिजलियाँ
सजदे तुम्हारी राह में करती है कहकशाँ
दुनिया-ए-हुस्न-ओ-इश्क़ का तुम ही शबाब हो
అధరాల పై చిరునవ్వులు తటిల్లతలా
నీ కోసం శిరస్సు వంచిన పాలపుంతలు
జగత్తు లో అందానికి యవ్వనానికి నీవే చిరునామా
షరా :: పాట లోని కొన్ని పదాలకు సరిగ్గా అనువాదం కుదర లేదు.
ఈ పాట లోని ఉర్దూ పదాలు :
Chaudhvin ka chand = పొర్ణమి
Aaftaab = సూర్యుడు
Lajawab = అసమానమైన
Maey = మధువు
Saaz = వాయిద్యం
Jaane bahaar = వసంత శోభ
Khwaab = స్వప్నం
Tabassum = చిరునవ్వు
Sajda = శిరస్సు వంచి ప్రమాణం
Kaikashaan = పాలపుంత
Duniya-e-husno-ishq = మిస్ వరల్డ్
Shabaab = యవ్వనo
పాట గురించి :
షకీల్ బదాయూని రాసిన గీతాల్లో అజరామరం ఇది.
పాటలో ప్రకృతి భాగాలైన చంద్రుడు,సూర్యుడు, మేఘాలు,సరస్సు,పాల పుంతలు దర్శన మిస్తాయి.ప్రేయసిని వీటితో పోల్చి, ఆమె అందానికి సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు కవి.(ఎలివేషన్ అంటే ఇప్పటి హీరో లకు ఇచ్చేయేది కాదు సుమా !)
ప్రతి వాక్యం ప్రేయసి అందానికి సలాం చేస్తుంది.
మొదట్లో చంద్ర బింబమా /సూర్య బింబమా అని మీమాంస ఉన్నా — ఏదైనా సరే ఆమె వదనం matchless అంటే ఎవరికీ సాటిరానిదని చెప్పటం లో she is unique అని భావం.
ఇకపొతే కురులు,చిరువవ్వు, కనుదోయి ల ను మేఘాలు,తటిల్లతలు ,మధు పాత్రలతో పోల్చటం సూపర్.
Duniya-e-husno-ishq = జగత్తు లో అందం +ప్రేమ కలబోసినా ఇంతి – అని చెప్పటం – ఓహ్!
పాట పాడిన రఫీ గురించి చెప్పే సాహసం, ఆ గొంతులో మాధుర్యం , పలికించిన భావాలు విశ్లేషణ నాఊహకు కూడా అందనిది.
ఈ పాట 65 ఏళ్ళ నాటిది. ఇంకా నిత్యయవ్వనం గా, ప్రేమిక అందాన్ని వర్ణించే పాటలలో తల మానికంగా నిలిచిపోయింది. https://youtu.be/uAsM_D5oO9c?si=BAd7NPU4vnARWL5Q
-ghouse
ghose భాయ్
ఈ పోస్ట్ పెట్టినందుకు మీకు ప్రత్యేక అభినందనలు
నిజంగా ఇది ఒక అద్భుతమైన పట
నేను ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పాట వింటూ మీ తెలుగు అనువాదపు మాటలు చదువుతున్నాను
నాకు హిందీ లిపి చదవడం అంతంత మాత్రమే వచ్చు
కానీ నా కాస్మోపాలిటన్ up bringing వలన పాత హిందీ సినిమాల / గీతాల పట్ల అభిరుచి అయితే వున్నది
మీ ప్రయత్నానికి నా అభినందనలు
ఒక్క ప్రశ్న .. బహుశా చౌదవి అంటే 14 వ రోజు అని అర్ధం .. అది పున్నమి కంటే ఒక్కరోజు తక్కువ
అని విన్నాను .. అంత ఖచ్చితంగా తెలీదు
ఇలాంటి పోస్ట్ లు మరిన్ని మీరు భవిష్యత్తులో పెడుతారు అని ఆశిస్తాను
పున్నమి నాడు చంద్రునిలో మచ్చలు కనపడినా .. 14 వ రోజున అసలు మచ్చలు కనపడవు అని అంటారు (ట)
అవునా ? కాదా ?
అవునండి. 14 వ రోజు చంద్రుణ్ణి chaudvi క చాంద్ అంటారు.
తెలుగులో 15 వ రోజు చంద్రుణ్ణి పూర్ణిమ అంటారు కదా..
14 వ రోజు చంద్రుణ్ణి తెలుగు లో ఏమంటారో నాకు తెలియదు.
ప్రతిచోటా పున్నమి /పూర్ణిమ అనే చదివాను.
నాకూ రాయాలని ఉంది.. ఓ 50 పాటలు /ఘజళ్ళు నా టార్గెట్ . చూద్దాం ఎంతవరకు సఫలీకృతుడౌతానో ?