ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలం లో గుడారం లాంటిది వేసుకుని పిల్లా జెల్లా తో ఒక పది మంది ఉండడం రోజూ చూసే నాకు అలవాటే..కానీ స్నిగ్ధ పొద్దస్తమానం అలా కిటికీ లోంచి వాళ్ళను చూస్తూనే ఉంది. వాళ్ళు ఏం తింటారు…ఎలా ఉంటారు…ఏం చేస్తూ ఉంటారు ఇదంతా గమనిస్తూనే ఉంది. డాబా మీదకి బట్టలు తేవడానికి వెళ్ళి సన్నజాజులు కోస్తూ ఉంటే నన్ను అడిగింది. అక్కా నాకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారో అడగాలని ఉంది అంది. దాని ఉత్సాహం తెలిసిన నేను పద నేను కూడా వస్తాను అన్నాను. వాళ్ళు మొహమాటపడి మాట్లాడరేమో అని పిల్లలకి రెండు బిస్కట్ పాకెట్లు కొని పట్టుకుని వెళ్ళాము అదీ నేను. మేము రావడంచూసి ఎడ్ల బండి లోపలికి వెళ్ళి దాక్కున్నారు పిల్లలు. స్నిగ్ధ వాళ్ళని మెల్లగా పిలిచి మాటా మంతి మొదలుపెట్టింది.కొంచెం హిందీ,కొంచెం తెలుగు లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అందరిలోకి కొంచెం పెద్ద వయసు ఉన్న ఆవిడ పొయ్యి రాజేస్తోంది. కొంచెం మధ్య వయస్కురాలు గా ఉన్న ఆవిడ ఒక పన్నెండేళ్ళ పాప తో ఏదో మాట్లాడుతోంది. ఆ పాప తల్లి వయసు ఉన్న ఆవిడ తో మాటలు కలిపాము ఇద్దరం. ఎక్కడనుంచి ప్రయాణం చేస్తున్నారు ఎలా ఇలా సంచార జీవితం చేస్తారు అని అడుగుతూ మాటల మధ్యలో వాళ్ళ పీరియడ్స్ గురించి అడిగింది స్నిగ్ధ.

మెదక్ హైవే మీద ఉన్న చిన్న గ్రామానికి ప్రవీణ్ కి ఈ మధ్యే ట్రాన్స్ఫర్ అయ్యింది

హైదరాబాదు నుంచి వచ్చి వెళ్ళడం కన్నా ఇదే ఊర్లో ఉండిపోవాలని ఉండిపోయింది తను. కొత్త సంసారం కూడా కాబట్టి పది రోజులు ఉండి అక్కకు అన్నీ సర్ది పెట్టి రమ్మని స్నిగ్ధ ని పంపించారు నాన్న.

వరండాలో ఏదో చదువు కుంటున్న ప్రవీణ్ స్నిగ్ధని అడిగాడు…ఏమోయ్ మరదలు పిల్లా ఏంటి ఏదో రీసెర్చ్ వర్క్ చేస్తున్నావు అంటూ..

కానీ స్నిగ్ధ ఈ లోకం లో లేనట్లు ఏదో ఆలోచిస్తోంది…విషయం ఏంటని ప్రవీణ్ నన్ను చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు.

ఇందాక గుడారం దగ్గర ఆవిడ చెప్పిన మాటలు గుర్తువచ్చి స్తబ్దుగా ఐపోయాను…

రొట్టెలు కాల్చడం ఐపోయాకా గోరువెచ్చగా ఉన్న ఆ కచ్చిక ని పీరియడ్స్ లో వచ్చే రక్తం ఆగడానికి పెట్టుకుంటారట….

0

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

హిందీ పాటలు -లిరిక్స్

Roman Script Hamne Dekhi Hai Un Aankho Ki Mehekti KhushbooHaath

Window

My eastern side window Grants me a peep into life.