Uncategorized

స్వదేశీ నినాదం చెరువు మీద అలగటం లాంటిది

విదేశీ మార్కెట్లలో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడో లేక విదేశాలు మనని చులకన చేశారు అనుకున్నప్పుడో మనకి సర్రుమని వస్తుంది – ముందుగా కోపం, తరువాత స్వదేశీ నినాదం. స్వదేశీ వస్తువులు మాత్రమే కొనటం అంత గొప్ప విధానమైతే ఎప్పుడూ అదే దారిలో నడవొచ్చుగా. మన దేశంలో దాదాపు 1991 దాకా అదే విధానం అమలయ్యింది. స్వాతంత్య్రం వచ్చాక అప్పటి
85 views
September 22, 2025

రాజమ్మ

by
“ముసలిది ఇంకా ఎంత కాలం బ్రతుకుతాదో, చెయ్యలేక చస్తున్నా” అంటూ పక్క ఎక్కింది సుమిత్ర. ఏమమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం. ఆ ముసలిదీ ఆయనకు నానమ్మ పేరు రాజమ్మ, గత ముప్పై ఐదు ఏళ్ళుగా మంచాన పట్టి ఉంది. మాట రాదు, ఎవ్వరిని గుర్తుపట్టదు, ఒంట్లో ఏ అవయవం కదల్దు. ఒరిస్సాలో జయపూర్లో మెయిన్ రోడ్కు కుడి పక్క
December 30, 2025
14 views

అభీ నజావో ఛోడ్ కర్

by
అలెక్సాలో “అభీ నజావో ఛోడ్ కర్” అన్న పాట వస్తోంది. ఆ పాట విన్నపుడల్ల తనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. జయదేవ్నీ రఫీనీ ఆషాని మెచ్చుకోకుండా ఉండలేడు. అంత మధురంగా ఉంటుంది, గ్లాస్ లో సింగల్ మాల్ట్ వేసుకొని స్టూడియోలోని కుర్చీలో కూర్చొని ఆ ఆరు పెయింటింగ్స్ వైపే చూస్తున్నాడు. గిరీశం ఇప్పటికి 6 సార్లు వెయ్యటానికి
December 25, 2025
9 views

శాంతమ్మ గారి శాస్త్రం… స్పీకర్ స్మిత సూత్రం!

by
కలియుగంలో సాంకేతికతకు, సంప్రదాయానికి మధ్య జరిగే యుద్ధాలకు కొదవే లేదు. కానీ విశాఖపట్నంలోని సీతమ్మధారలో, సుబ్బారావు గారి ఇంట్లో జరుగుతున్నంత భీకరమైన యుద్ధం బహుశా ముల్లోకాలలోనూ జరిగి ఉండదు. అక్కడ ఒక పక్షం, ఇల్లాలు శాంతమ్మ గారైతే, అవతలి పక్షం అమెరికా నుండి దిగుమతి అయిన ‘స్మిత’ అనే స్మార్ట్ స్పీకర్. మధ్యలో నలిగిపోతున్న అమాయకపు మధ్యవర్తి, భర్త
December 1, 2025
19 views

వికృతభోజుని వృత్తాంతము

పూర్వం నైమిశారణ్యంలో వికృత భోజుడు అనే దానవుడు బ్రహ్మవరం పొందాలని ఘోరమైన తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకి మెచ్చి ఒక నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, “నాయనా, నీ తపస్సును మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు”. అందుకు ఆ దానవుడు, దేవా నేను భోజన ప్రియుడను. నీ వరం పొందాలని సవిరామ ఉపవాసం చేస్తూ,
November 23, 2025
11 views

యాదమ్మింట్లా మామిడిచెట్టు

by
“వారీ! ఎవల్లల్ల ఆకెల్లి? మీ నోట్లల్లా మన్నుబడ, ఏం గత్తరొచ్చినాదిరా, నాగ్గాన దొరికిండ్రా? బిడ్డా! ఒక్కోనికి బొక్కలిరిపి బొంద పెడ్తా మళ్ళా” యాదమ్మ నోరు సగమూరిదాంక ఇనబడుతుండె.“అయ్యా! ఏమాయినే యాదమ్మ? పోరలను బొందలోపెడ్త నంటుంటివి, ఏంజేస్తిరే అంతమాగం?” శాయన్న సర్దిజెప్ప బోయిండు.“ఇంగో సూడు శాయన్న! సెట్టు మీద మామిడికాయల్ని బతకనిస్తలేరు, పొద్దాకుల గడ్డలిచ్చుక్కొడుతుండ్రు మంద, గడ్డలొచ్చి ఇంట్ల పడుతుండే,
November 16, 2025
5 views

గమనం

by
అనిత, సుజాత, ప్రమీల, శైలజల స్నేహం చాలా బలమైనది. వాళ్ళ నలుగురి స్నేహాం ఆరో తరగతి విజయనగరంలో మొదలైంది. ఒకే బెంచ్ మీద నలుగురు కూర్చునేవారు. ఒకేసారి మధ్యాహ్నం భోజనానికి డబ్బాలు తెరిచేవారు, వారు తెచ్చుకున్న వాటిని పంచుకొని తినేవారు. ఆస్తిపాస్తుల్లో తేడాలు ఉన్నప్పటికీ పెద్దగా అభిప్రాయాలూ కానీ వాటి బేధాలు కానీ ఏమి లేవు వారిలో. పదో
November 1, 2025
20 views

గాజు కిటికీ – రెండు ప్రపంచాలు

A view from my Office window నీలాకాశం, నీరు, చల్ల గాలి –అన్నీ కవితలు రాస్తుంటేనా కీబోర్డ్ మాత్రండెడ్‌లైన్‌ లను లెక్కపెడుతోంది కిటికీ ఆవతల ప్రకృతి పాడుతున్న గీతంకానీ నా మనసు ఆ మెలోడీ ని మ్యూట్ చేసిఒక టీంస్ కాల్ లో చేరిపోతుంది శరదృతువు బయట రంగుల కేళి ఆడుతుంటేలోపల మనసు ఒకే నీలిమ లో
October 14, 2025
11 views

సంక్షేమ పధకాల ద్వారా అభివృద్ధి – ఇదొక వినూత్న ఆర్ధిక సూత్రం

ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కధనం ప్రచురించింది. జీఎస్టీ రేట్లు తగ్గటం, అంతేగాక “తల్లికి వందనం” పథకం ద్వారా దాదాపు అన్ని కుటుంబాలకి డబ్బులు రావడం వల్ల అంధ్రాలో అనేక రకాల వస్తు సామాగ్రుల అమ్మకాలు పెరిగాయని, ఆఖరికి ఆ డబ్బుతో బంగారం కూడా కొని దాచుకుంటున్నారని. ఆ విధంగా కూటమి ప్రభుత్వం విధానాల వల్ల ప్రజల
October 13, 2025
10 views

నోరు లేని బంగారు బాతు

స్విగ్గీ డెలివరీ బాయ్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఇంకా… యమలోకంలోని యమకింకరులకి ఒక పోలిక ఉంది. వీళ్ళల్లో ఎవరికీ యూనియన్లు లేవు. రేపు జీతాలు పెంచటానికి బదులు తగ్గించినా, లేదా అసలు ఉద్యోగాలే పోయినా అడిగేవాడు లేడు.  సరే, మిగతావారి సంగతి పక్కనపెట్టి IT/KPO రంగం లోని ఉద్యోగుల గురించే కాసేపు మాట్లాడుకుందాం. అసలు వీళ్ళ బాగోగుల గురించి
October 8, 2025
31 views

హిందీ పాటలు -లిరిక్స్

అతివ వర్ణన పాటల సిరీస్ లో రెండో పాట : अब क्या मिसाल दूँ मैं तुम्हारे शबाब की ఆరతి సినిమా లోనిది. రఫీ గాత్రం /మజ్రూహ్ రచన /రోషన్ సంగీతం. अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब कीइन्सान बन गई है किरण माहताब की चेहरे में घुल
September 28, 2025
8 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog