1970 శ్రావణంలో వర్షం పడుతుండగా ఒక చీకటి రాత్రి (కరెంటు పోయింది లెండి), పెట్రోమాక్స్ దీపాల వెలుగులో తడిచిన వీధి అరుగు మీద గొడుగులు పట్టుకు కూర్చున్న పెద్దల సమక్షంలో సునందా గోవిందరావుల పెళ్లి జరిగింది అనుకుంటా.

పెళ్ళైన కొత్తలో “నుదుట పెద్ద బొట్టు పెట్టుకో” అన్నాడు గోవిందరావు ,  “నాకు చిన్నదే ఇష్టం ” అన్నాది సునంద. నవ్వి ఊరుకున్నాడు

చుట్టాల ఇంట్లో ఏదో శుభకార్యం ఉంటె “పెళ్ళికి కుట్టించిన కోట్ వేసుకోండి ” అంది తను ,

“తనకి కోట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదో పెళ్ళికి అందరూ పోరితే కుట్టించుకున్నాను” అన్నాడు

ఖద్దరు లాల్చీ వేసుకు వచ్చాడు, ఆమె మౌనంగా వెంట వెళ్ళింది.

ఓ రోజు కాకరకాయ వేపుడు చెయ్యమన్నాడు, లేదు బెల్లం వేసి పులుసు పెడతాను అమ్మ అలానే చేసేది అన్నాది.

కొన్నాలకి కృష్ణ సినిమాకి వెళ్దాం అన్నాది లేదు నాకు ఎన్టీఆర్ ఇష్టం, అదిరిపోయే డైలాగులు ఉంటాయి అన్నాడు.

ఇలా చిన్న చిన్న అభిప్రాయ బేధాలతో వారి సంసారం ఇద్దరి నుండి ఐదుగురిగా మారింది.

పిల్లలు పెరగడం, చదువులు పెళ్లిళ్లు కాలానికి అనుగునంగా మానవ ప్రయత్నాలతో అవి జరిగిపోయాయి.

పెళ్ళైన ఓ యాభై ఏళ్లకు ఆరోజు పెద్ద బొట్టు పెట్టుకొని కాకరకాయ వేపుడు చేసింది సునంద, ఇదేం మార్పు అని అతను అడగలేదు ఆవిడా చెప్పలేదు, కళ్ళతో మాట్లాడుకున్నారు.

అది జరిగిన ఇంకో ఆరు నెలలకు అనుకుంటా ఓ సాయంత్రం (కృష్ణ ఇంక లేడు కానీ వాళ్ళ అబ్బాయి) మహేష్ బాబు సినిమాకి వెళ్ళారిద్దరు.

ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ ఉన్నంత కాలం ఆలా స్నేహంగానే అభిప్రాయ బేధాలతో జీవనం సాగిస్తారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే మొన్న ఎక్కడో విన్నట్టు గుర్తు తనకు నచ్చ్చినట్టు ఉండటం లేదని భార్యా భర్తలు విడాకులు తీసుకుంటున్నారట

1

3 Comments Leave a Reply

  1. ఎవరికైనా గాని జీవన గమనం లో biggest compromise is పెళ్లి!

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

గురువు గారు

హైదరాబాద్ .ఇండియన్ బ్యాంక్ నల్లకుంట బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నప్పుడు,ఒక సీనియర్ సిటిజన్

నా అమెరికా యాత్ర -1

ట్విట్టూరి లో ఉన్న పిల్లల్లా తుర్రు మంటే అమెరికా వెళ్ళే ఉద్యోగాలు కావు