
“వస్తానన్నాడు”
బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది ప్రియ. నిశ్శబ్దం… గాలి కూడా కదలని నిశ్చలత. ఆకాశం మేఘాలతో కప్పబడి, చంద్రుడు, చుక్కలు కనిపించటం లేదు. వర్షం వస్తుందేమో అనిపించింది. కరెంటు పోయి, చుట్టూ చీకటి. గదిలోనూ అంధకారమే. ఇన్వర్టర్ పనిచేయక చాలా కాలమైంది. కొవ్వొత్తి వెలిగించాలన్న ఆలోచన కూడా రాలేదు. “వస్తానన్నాడు…”