తొమ్మిదవ తరగతి లో చేరాను పెడన జడ్పీ హైస్కూల్ లో. ఇంటికి దగ్గరే స్కూల్. అన్ని పూరి పాకలు. స్కూల్లో HM గారిది మాత్రమే పెంకుటింటి బిల్డింగ్.
పెడన లో దేవాంగులు ఎక్కువ గా ఉండేవారు. మేము శేషగిరి గారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్లి, చీర అంచులు, చీర డిజైన్లు ఎలా చేస్తారు, యార్న్ పై గంజి ఎలా పెడతారు, కండెలు ఎలా రాట్నం లో తిప్పుతారు, మగ్గం లోకి ఎలా ఎక్కిస్తుంటారు వగైరా అంత క్షుణ్ణం గా తెలుసుకొన్నా.
ఒక సారి మగ్గం గుంటలో కూర్చొని నేయటం ట్రై చేసాను.. సరిగ్గా కాళ్ళు కదపలేక పోయినందువల్ల షటిల్ నా మోకాలి చిప్పని రాసుకొంటూ వెళ్ళింది.. రక్తం చాలానే కారింది. మళ్ళీ మగ్గం గుంటలో కూర్చుంటే ఒట్టు..
స్కూల్ లో అన్ని సబ్జక్ట్స్ లో నేను గారు ఫస్టు. నా తెలుగు వ్యాకరణం నోట్ బుక్ ను క్లాస్ అందరూ చూసి రాసుకోమని తెలుగు మాస్టారి హుకుం. ఆ రోజుల్లో ఆ లెవెల్ మనది.
ఇలాంటి ఆట పాటల మధ్య, 8 క్లాస్ లో ఫస్ట్ వచ్చిన సందర్భం లో నా కాష్ బహుమతి, oxord ఇంగ్లీష్ డిక్షనరీ వచ్చి తీసుకోమని బందర్ నోబుల్ స్కూల్ నుండి ఉత్తరం.స్కూల్ లైబ్రరీ కి డొనేట్ చెయ్యమని నాన్నగారు చెప్పారు.అలాగే నేను ఉత్తరం రాసాను.
అవగాహన లేని సగటు నిమ్న మధ్య తరగతి జీవితాలు. ఎంత దూరం ? 10 కిమీ. వెళ్లి తీసుకొంటే ఎంతటి అనుభూతో కదా. ఆ రోజులు అలా ఉండేవి.
ఇలా ఉండగా.. మరల 10 కిమీ దూరం లో ఉన్న కవుతరం కు ట్రాన్స్ఫర్. ఇంకో స్కూల్ లో 10 వ తరగతి చేరాలి.
మూట ముల్లె సర్దుకొని బయలు దేరాం.
- సశేషం
తొమ్మిదవ తరగతి లో చేరాను పెడన జడ్పీ హైస్కూల్ లో. ఇంటికి దగ్గరే స్కూల్. అన్ని పూరి పాకలు. స్కూల్లో HM బిల్డింగ్ మాత్రమే పెంకుటింటి బిల్డింగ్.
పెడన లో దేవాంగులు ఎక్కువ గా ఉండేవారు. మేము శేషగిరి గారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్లి, చీర అంచులు, చీర డిజైన్లు ఎలా చేస్తారు, యార్న్ పై గంజి ఎలా పెడతారు, కండెలు ఎలా రాట్నం లో తిప్పుతారు, మగ్గం లోకి ఎలా ఎక్కిస్తుంటారు వగైరా అంత క్షుణ్ణం గా తెలుసుకొన్నా.
ఒక సారి మగ్గం గుంటలో కూర్చొని నేయటం ట్రై చేసాను.. సరిగ్గా కాళ్ళు కదపలేక పోయినందు
వల్ల షటిల్ నా మోకాలి చిప్పని రాసుకొంటూ వెళ్ళింది.. రక్తం చాలానే కారింది. మళ్ళీ మగ్గం గుంటలో కూర్చుంటే ఒట్టు..
స్కూల్ లో అన్ని సబ్జక్ట్స్ లో నేను గారు ఫస్టు. నా తెలుగు వ్యాకరణం నోట్ బుక్ ను క్లాస్ అందరూ చూసి రాసుకోమని తెలుగు మాస్టారి హుకుం. ఆ రోజుల్లో ఆ లెవెల్ మనది.
ఇలాంటి ఆట పాటల మధ్య, 8 క్లాస్ లో ఫస్ట్ వచ్చిన సందర్భం లో నా కాష్ బహుమతి, oxord ఇంగ్లీష్ డిక్షనరీ వచ్చి తీసుకోమని బందర్ నోబుల్ స్కూల్ నుండి ఉత్తరం.స్కూల్ లైబ్రరీ కి డొనేట్ చెయ్యమని నాన్నగారు చెప్పారు.అలాగే నేను ఉత్తరం రాసాను.
అవగాహన లేని సగటు నిమ్న మధ్య తరగతి జీవితాలు. ఎంత దూరం ? 10 కిమీ. వెళ్లి తీసుకొంటే ఎంతటి అనుభూతో కదా. ఆ రోజులు అలా ఉండేవి,