మరుపురాని అనుభూతి!!

1985. కర్ణాటకలో పని చేస్తున్నప్పుడు, నేను డిపాజిట్ల సేకరణలో కొంచెం చురుకు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్న నిజాం ట్రస్ట్ నుండి deposit తీసుకోవాలని ఒక మొండి పట్టుదల మనసులో

ఎలా అబ్బా

సరే హైబా లో ఒక పెద్ద వ్యక్తిని పట్టాఆయనేమీ చెప్పారంటే,decisions అన్ని his highness  తీసుకొంటారు

కాబట్టి మనం ట్రై చేద్దాం అన్నారు.

His highness అంటే ఎవరూ అని అడిగా? దివంగత నిజాంగారి కుమారుడు..ముకరం జా అని చెప్పారు. ఇంకా ఐనట్టేలే అని నిరాశ పడ్డా. నేను ఆ విషయం మర్చి పోయా.

ఆరు నెలల తర్వాత ఒక రోజు అ సదరు వ్యక్తి నుండి ఫోన్. ఆస్ట్రేలియా నుండి వచ్చారు ముకరంజా గారు. ఎల్లుండి అప్పాయింట్మెంట్ 11 గంటలకు అని అన్నారు. ఇదేమిటని విస్తుపోయా. అప్పుడు తెలిసింది ఆరు నెలల ముందే అప్పాయింట్మెంట్ తీసుకున్నారని. నేను హైబా బయలు దేరాను.

మధ్యవర్తి గారు నా వేషం చూసి కొంచెం నిరాశ పడ్డారు. నేను మామూలుగా షర్ట్ టక్ . నో జాకెట్. నాకు జాకెట్ లేదు అప్పుడు. ఈ వ్యక్తి షేర్వాని లో రెడి. మేము కారులో బయలు దేరాము.

ఏదో పాలస్ లో ఉండేవారు ఆ రోజుల్లో ముకర్రంజా. కారు బయలు దేరిన తర్వాత నాతో ఉన్న వ్యక్తి ” ముకరం జా గారి సమయం విలువైనది. Precise గా మాట్లాడు. extra మూవ్మెంట్స్ అవీ చేయవద్దు. He is a prince అని భయపెట్టాడు”.

కారు గేటు లోకి ఎంట్రీ. అక్కడ ఉన్న వారు మమ్మల్ని చెక్ చేసి confirm చేసుకొని లోనికి వెళ్ళమని చెప్పారు . కారు సర్కులర్ డ్రైవ్ వే దాటి పాలస్ గుమ్మం ముందు ఆగింది. కారు ఆగిన చోట నాలుగు మెట్లు ఉన్నాయి.అక్కడ ఒక 55 ఏళ్ళ సాదా సీదా వ్యక్తి మా కారు ఆగగానే కారు తలుపు తీసాడు. నాతో వచ్చిన వ్యక్తి ఆయనకు రెండు మూడు సార్లు సలాం చేసాడు . నేను కారు అటువేపు నుండి దిగి ఇటు వచ్చేటప్పుడు తను మెల్లగా చెప్పాడు ..ఆయనే ముకరంజా అని. నాకు నోట మాట రాలేదు. అంతా పెద్ద వ్యక్తి మా కారు డోర్ తెరవడమేమిటి ? ఇంత సాదా సీదా గా ఉన్నాడేమిటి అనుకుంటూ సలాం చేసాను.

లోపలి వెళ్ళగానే కళ్ళు జిగేల్ మన్నాయి. Rare wall to wall carpets . బ్యూటిపుల్ లైటింగ్. Priceless పెయింటింగ్స్. ఒక మ్యూజియం కు వచ్చానా అనిపించింది. లోపలికి అంటే ఒక ఆరు గదులు దాటి ఓ పెద్ద హాల్లో మూడు సోఫాల్లో ఆశీనులయ్యాం.నేను షాక్ నుండి తేరుకోలేదు. ముకరం జా గారు అది గుర్తించారు లా ఉంది.

నా పక్కన వచ్చి కూర్చొన్నారు. నన్ను కుశల ప్రశ్నలు వేసారు. ఆ తర్వాత ఆయన నా పుట్టు పూర్వొత్హరాలు, నా చదువు అవి కనుక్కున్నారు. ఉద్యోగం ఎలా వచ్చింది అని అడిగారు. నేను అల్ ఇండియా కాంపిటిటివ్ పరీక్ష అని చెప్పాను. రాంక్ వచ్చిందా అని అడిగారు. తొమ్మిదో రాంక్ అని చెప్పాను. అప్పుడు ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ అన్నారు.నా భుజాన్ని తట్టారు. ఇంతలో అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆయన బట్లర్ ఒక ట్రాలీ తోసుకొంటూ టీ సరంజామా తీసుకొని వచ్చాడు. He was immaculately dressed.

ముకరంజా గారు చటుక్కున సోఫా నుంచి లేచి కార్పెట్ మీద కూర్చొని నన్ను చూసి షుగర్ ఎంత కావాలి అని అడిగారు. నాతో వచ్చిన ఆయనను కూడా అడగి తానే చక్కర కలిపి స్వహస్తాలతో టీ కప్పులు మా కిద్దరికి ఇచ్చారు. నా అనుభూతి వర్ణనాతీతం.

Old traditions,hospitality అంటే ఇదేనేమో అనిపించింది.

నాకు కళ్ళు తిరిగాయి. నిజాం బిడ్డ నాకు టీ సర్వ్ చేయటం ..I can not define that feeling.

నేను మెల్లగా వచ్చిన పని చెప్పాను. ఒకే అని చెప్పి ఒక పెద్ద మొత్తం డిపాజిట్ ఇమ్మని ఆయన ఫైనాన్స్ పర్సన్ కు intercom లో చెప్పారు. నేను ధన్యవాదాలు తెలిపాను. He Brushed them aside. అప్పటికే 25 నిమిషాలైంది. సరే మేము సెలవు తీసుకుంటాం అని చెప్పాము. ఆయన అత్తరు తెచ్చి మా ముంజేతులకు పూసి ఖర్జూరం ఆఫర్ చేసారు. ఆయన మాతో బాటు బయటకు వచ్చారు. నేను కారు ఎక్కబోతుంటే ముకరంజా గారు ఒక అడుగు ముందుకేసి నేనెక్క బోతున్న కార్ డోర్ తీసి పట్టుకున్నారు. నాకు ఎలా ఫీల్ అవ్వాలో తెలియరాలేదు. ఆయనే డోర్ క్లోజ్ చేసి మమ్మల్ని సర్కులర్ డ్రైవ్ చివరి వరకు వెళ్ళే దాక గుమ్మం లోనే నిలబడి చూస్తూ ఉండిపోయారు.

ఆ రోజు నేను పొందిన అనుభూతి మరువలేనిది.

నన్ను ఇంటర్వ్యూ కు తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఇంపార్టెన్స్ was the key.

Leave a Reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

ఇన్‌సైడ్‌మల్లి

ఈ తరం రచయిత వి.మల్లికార్జున్‌తో కాసేపు…   ఊరు నల్లగొండ. పేరు మల్లికార్జున్.

“వస్తానన్నాడు”

బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది