మ్యాట్ని!


మ్యాట్ని ! 

((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!))

అంతా చీకటిగా వుంది, ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించి, లేచి గడియారం చూస్తే తెల్లవారు ఝాము 5 అవుతోంది. మళ్ళీ కాలింగ్ బెల్ రెండు సార్లు వినిపించింది. ఇంత పొద్దున్నే ‘ఎవరా?’ అనుకుంటూ పక్కనే వున్న భర్తని  లేపింది.   అతను గడియారం చూసి, “తెల్లవారుతోంది కదా, నువ్వే వెళ్ళి చూడు”,   అని పక్కకి తిరిగి పడుకున్నాడు.

ఇంకా కాలింగ్ బెల్, దబదబా తలుపులు మార్చి మార్చి మ్రోగుతూనే ఉన్నాయి.  ఇక తప్పదు అనుకుంటూ బట్టలు సరిచేసుకుని, జుట్టు ముడి పెట్టుకుంటూ మంచం దిగి హాల్ వైపు అడుగులు వేసింది. కాలింగ్ బెల్ మళ్ళీ మొగింది. “ఎవరూ? వచ్చే, వచ్చే!” హెచ్చు గొంతుతూ అంటూ,  హాలులో వున్న దేవుడి పటానికి దణ్ణం పెట్టుకుంటూ గడియ తీసింది.

గుమ్మం ముందు మొహానికి చిన్న ట్రావెల్ బాగ్ అడ్డం పెట్టుకుని నిలుచుని వున్న    ఆకారం ఎవరా?  అని పరిశీలనగా చూసింది.   బాగ్ వెనుకనుండి “అక్కా! నేనే వచ్చా!” అని తమ్ముడు రామకృష్ణ గొంతు వినపడింది.   పార్వతికి ఒకింత ఆశ్చర్యంతో, సంతోషంతో తలుపు బార్లా తీస్తూ “ఏరా! వచ్చావా? ఊడి పడ్డావా?” అంటూ తమ్ముడు లోపలికి రావడానికి వీలుగా  పక్కకి జ రుగుతూ,  “ముందు లోపలికి రా రా! చలిగా వుంది. అయినా వచ్చే ముందు ఫోన్ చెయొచ్చుగా?”.  

రామకృష్ణ చెప్పులు గుమ్మం బయట పక్కగా విడిచి లోపలికి వస్తూ “బావ గారు లేచారా?”.  ‘లేదు’,  అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ తలుపు వేసి గడియ పెట్టింది. సోఫా పక్కనే బాగ్ పెడుతున్న తమ్ముడితో, “బట్టలు మార్చుకుని రా రా! వేడి వేడి కాఫీ ఇస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది.

పార్వతి రెండు కప్పులతో కాఫీలు తీసుకుని వచ్చే సరికి, రామకృష్ణ బట్టలు మార్చుకుని, సోఫాలో కూర్చుని వున్నాడు.  ఒక కప్పు తమ్ముడికి ఇచ్చి, సోఫా కి దగ్గిరగా కుర్చి లాక్కుని, ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది.   రామకృష్ణ కాఫీని ఆఘ్రాణిస్తూ, “ఆహా! నీ చేతి కాఫీ అధ్బుతం.”    కాఫీ రెండు గుక్కలు తాగి,  “ఏమీ లేదక్కా! చాలా రోజులు అయ్యింది, ఒక సారి చూసి పోదామని వచ్చా”,

మళ్ళీ కాఫీ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ. పార్వతి, “సంతోషం! ఒక్కడివే వచ్చావే?” అని అడిగింది.

రామకృష్ణ  తాగుతున్న కాఫీ కప్పు పక్కన పెడుతూ ” ఓ! అదా! నీ మరదలు వాళ్ళ పుట్టింటికి, నేను నా పుట్టింటికి.  రేపు నేను అక్కడికి వెళ్ళి, ఎల్లుండి పొద్దునే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము.”

పార్వతి కుర్చీలో సర్దుకుంటూ, “అయ్యో! తనని కూడా తీసుకువస్తే బావుండేది. నువ్వు వెళ్ళేటప్పుడు, తన జాకెట్లు రెండు ఇక్కడే వుండిపోయాయి, మర్చిఫొకుండా తీసుకు వెళ్ళు.”

రామకృష్ణ మళ్ళీ కాఫీ కప్పు తీసుకుంటూ “ఈ సారి, ఇలా వచ్చి అలా వెళతాములే. ఇంకా ఏంటి అక్కా విశేషాలు?”.

పార్వతి కుర్చిలోంచి లేచి, ఖాళీ అయిన కప్పులు తీస్తూ,  “నువ్వు ఆ రెండో  బెడ్ రూం లో కాసేపు పడుకో.  శనివారమేగా, పని హడావిడి ఏమీ లేదు, తరువా త మాట్లాడు కుందాము”.

అక్కని ఆశ్చర్యంగా చూస్తూ, “పొద్దునే లేచి, దేవుళ్ళకి మేలుకొలుపు పాడే నువ్వా? ఇంకా పడుకో అంటున్నావు, అంతా కాల మహిమ”  అంటూ సోఫాలో నుండి లేచాడు.

తమ్ముడిని చూసి, పెదవి విరుస్తూ “ఏం చేస్తాం? కరోనా తర్వాత కొత్తరకం కష్టాలు వచ్చిపడ్డాయి. ఈరోజు వుంటావుగా? నీకే తెలుస్తుంది” అంటూ తన బెడ్ రూం లోకి దారి తీసింది.  అక్క వైపు కొంచెం అనుమానంగా చూస్తూ రెండో బెడ్ రూం లోకి దారి తీసాడు.

   ===== ******  ======
కప్పు భళ్ళున పడిన శబ్దంతో చటుక్కున కళ్ళూ తెరిచాడు రామకృష్ణ. గడియారం 11 గంటలు చూపిస్తోంది.  మంచం మీదనుండి లేచి కూర్చుంటూ వుండగా, వంటింట్లోంచి కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నాయి అక్కా బావల గొంతులు.

రామకృష్ణ కిచెన్ వైపు నడుస్తుండగా, పార్వతి గొంతు వినిపించింది “కప్పు పడిన శబ్దానికి వాడు లేచే వుంటాడు. ఇంకా మాట్లాడకండి”. న్యూస్ పేపర్ మడతపెడుతున్న గుసగుసలో బావ గొంతు “ఈరోజు శనివారం, శెలవు రోజు, ఇంట్లో మ్యాట్ని సంగతి ఏంటి?”

పార్వతి భర్తకి దగ్గిరగా జరుగుతూ “చీ ఊరుకోండి. ఈరోజు మ్యాట్ని లేదు, గీటిని లేదు. వాడు ఇంట్లో వుండగా అలాంటి పనులు ఏంటి? అసహ్యంగా?”

అప్పుడే కిచెన్ లోకి వస్తున్న రామకృష్ణ “నమస్కారం బావగారు! ఏదో మాట్ని అంటున్నారు, ఇక్కడ దగ్గిరలో ఏమైనా కొత్త థియేటర్స్ తెరిచారా? చాలా రోజులు అయ్యింది హాల్ లో సినిమా చూసి, నేను కూడా వస్తా పదండి” .

పార్వతి చేతిలో వున్న గరిట భర్త మరియు  తమ్ముడి మొహం మీద తిప్పుతూ “సినిమా లేదు, గినిమా లేదు.” అని తమ్ముడి వైపు తిరిగి “ఇక్కడ థియేటర్స్ ఓపన్ చెయ్యలేదు. ఆయన చేప్పేది వినకు.”

పార్వతి భర్త, పేపర్ మడిచి పక్కన పడేసి, భార్యని చూస్తూ,  “మ్యాట్ని పడాల్సిందే! .”  రామకృష్ణ కొంచెం ఆశ్చర్యంగా ఇద్దరిని చూసాడు. పార్వతి విసుక్కుంటూ “ఏంటండి ఇది. వాడి ముందు ఇలాంటి పనులు చేస్తే మీకే పరువు తక్కువ. ఈ వయసులో మీకు ఇలాంటి వేషాలు ??”

ఇదేదో చిత్రమైనా వ్యవహారాంలా వుందే అనుంకుంటూ, రామకృష్ణ అక్కతో “ఏంటి అక్కా? గంగా మహేష్ అనే పేరుగల బావగారు, ఎవరైనా చిన్న ఇల్లు, ఏమైనా…? “అంటూ నీళ్ళు నమిలాడు.

పార్వతి భర్తను చూస్తూ “నా అదృష్టం కొద్దీ, మీ బావగారి పేరులోనే నాకు సవతి వుంది గాని, వూరిలో లేదు”. అని, భర్తను బయటకు నెట్టుతున్నట్టుగా తోసింది.

తమ్ముడి వైపు తిరిగి “ఒరే, నువ్వు స్నానం చేసి రా, అందరం భోజనం చేసేద్దాం.  నీకిష్టమైన గుత్తి వంకాయ కూర!” .

వంటింటి గుమ్మం దాటుతూ పార్వతి భర్త “మరో మాట లేదు, మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!, ” అని హుకుం జారి చేసి వెళ్ళిపోయాడు.   ప్రశ్నార్ధంగా చూస్తున్న తమ్ముడి  మొహంలోకి చూడలేక, పార్వతి తలదించుకుంది.
 

భోజనాలు ముగించేసరికి ఒంటిగంటన్నర అయ్యింది.  అంతా భోజనాలు చేసిన తరువాత శుభ్రం చేసే పని వుందని లోపలికి వెళ్ళింది పార్వతి.. బావ మరుదులు ఇద్దరూ పిచ్చా పాటి మాట్లాడు కుంటూ కూర్చున్నారు.

 ఇంతలో బావగారి మొబైల్ ఫోన్ మోగింది. ఫోన్ చేతిలోకి తీసుకు, కట్ చేసి రామకృష్ణ ని చూస్తూ ” కాల్ కాదులే, అది అలార్మ్ ! మ్యాట్ని టైం అయ్యింది .”,   అని కిచెన్ వైపుకు చూస్తూ “పా రూ! “రెడీనా?”,  అంటూ ఉత్సాహంగా కేక పెట్టాడు.  గంగామహేష్ ఇప్పుడే వస్తా  అని,, అంతకు ముందు రామకృష్ణ రెస్ట్ తీసుకుని వచ్చిన గదిలో వెళ్ళాడు.  ఏమీ అర్ధంకాక, పక్కనే వున్న పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు.  ఒక పదినిమిషాలా తరువాత గంగామహేష్ బయటకు వచ్చి “రాము, అంతా రెడీ.”,  అని కిచెన్ లోకి చూసి “యేయ్ బుక్కింగూ! రెడీనా ?”  అని మళ్ళీ గావు కేక పెట్టాడు.

రామకృష్న్ణకి ఇదేమి అర్ధం కాలేదు. గంగా మహేష్ తన బెడ్ రూం లోకి వెళ్ళి, బయటకు వెళ్ళే వాడిలా నీటుగా తయరయి వచ్చాడు. అలా వచ్చిన బావగారిని చూసి, తను కూడా లేస్తూ, “ఒక్క నిమిషం బావగారు, నేను కూడా బట్టలు మార్చుకుని వస్తా” అని లోపలికి వెళ్ళీ జీన్స్ టి షర్ట్ వేసుకుని తల దువ్వుకుని వచ్చాడు.

వేడి నూనేలో శంగపిండి వేగుతున్న వాసన వస్తోంది.  చేతిలో గరిటె తో, జిడ్డు కారుతున్న మొఖం తో కిచెన్ లో నుండి వచ్చిన పార్వతి మొఖం చూసి “ఏంట క్కా? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా?”  అన్నాడు రామకృష్ణ అసహనంగా.

ముంజేతి తో మొహం తుడుచుంటూ, తమ్ముడితో, “నువ్వు, మీ బావగారు ఆ ప్రహసనం నడపండి, నాకు వేరే పనుంది”.  గంగా మహేష్ ముందుకు వచ్చి భార్యతో,  “ఎంటి? మ్యాట్ని మొదలయి పోయిందా? రెండు టికేట్ లు చించు” అన్నాడు. రామాకృష్ణ అక్కా బావలిద్దరిని అయోమయంగా చూసాడు. పార్వతి గంగా మహేష్, రామకృష్ణ ని వుద్దేశించి ” ట్రయిల్ పార్టి నాడుస్తోంది, మీరెళ్ళి కూచోండి, నేను మీ దగ్గరకు వచ్చి టికెట్లు చించుతా!” అంది.  

ఈ మాటలు విన్న రామకృష్ణ ఇంకా అయోమయంలో పడిపోయాడు.  ఇంతలో గంగా మహేష్, రామకృష్ణ ని “పద, పద” మంటూ తొందరపెడుతూ, ఆ రేండో రూములోకి తీసుకుని వెళ్ళాడు. గదంతా చీకటిగా వుంది,   సినిమా థియెటర్ లో లాగ, గోడ మీద ఎల్. ఈ. డీ స్క్రీన్ మీద సూపర్ స్టార్ కృష్ణ నటించిన కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్ళకు మోసగాడూ” టైటిల్ వేసి వుంది. ఆ చీకట్లోనే తడుముకుంటూ, రామకృష్ణ చేతితో లాక్కుంటూ తీసుకెళ్ళి కుర్చిలో కూలేసాడు అతని బావ గంగామహేష్.   రిమోట్ తో సినిమా మొదలయ్యింది. రామకృష్ణ కళ్ళు చీకటికి కొద్దిగా అలవాటు పడ్డాయి. టైటిల్స్ పడి, సూపర్ స్టార్ స్క్రీన్ మీద కనపడగానే కయ్యి మని విజిల్ కొట్టాడు, గంగామహేష్. ఆ శబ్దానికి, చెవులో వేలు పెట్టి తిప్పుకుంటూ వుండగా, గది తలుపు మెల్లగా తెరుచుకుంటూ, సన్నని వెలుతురు లోపలికి పడింది.  గంగామహేష్, “ఓయ్! తలుపెయ్, తలుపెయ్” అంటూ గట్టిగా అరిచాడు.

తలుపు వేసి లోపలికి వచ్చిన పార్వతి, వీళ్ళిదగ్గిరికి వచ్చి, చీకట్లో కాళ్ళు తొక్కి, గంగామహేష్ అడ్డంగా నిలబడి “టికెట్లకి డబ్బులు తియ్యండి” అంది.  గంగామహేష్ పార్వతిని పక్కకితోస్తూ “యెహే! అడ్డం తప్పుకో, ఫైటు మిస్సవుతుంది. కాళ్ళు తొక్కేసి, పైగా అడ్డంగా నిలుచున్నావు” అని విసుక్కుంటూ, ఆమే చేతిలో యాభై రూపాయల నోటు పెట్టాడు, టికెట్లకి డబ్బులు అన్నట్ట్లుగా. ఇప్పుడిప్పుడే, రామకృష్ణ కి కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లనిపించింది.  పార్వతి మెల్లగా తలుపు తీసుకుని వెళ్ళిపోయింది.

రామకృష్ణ కూడా, తన బావగారితో కలిసి సినిమాలో లీనం అయిపోయాడు. పెద్దసౌండుతో, చప్పట్లతో మధ్య మధ్య కామెంట్స్ తో రామకృష్ణ బావగారితో కలిసి సినిమా ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఇంకా గంగామహేష్ మరీ రెచ్చిపోయి, “కొట్టు, కాల్చు, దూకు” అంటూ అరుపులతో గదంతా అల్ల కల్లోలం చేస్తున్నడు. రామకృష్ణ కూదా ఉషారెక్కి విజిల్స్ కొట్టడం మోదలు పెట్టాడు.  ఏదో పాట వస్తుండగా, తలుపు బార్లా తెరుచుకుంది.

ఉల్లిపాయ పకోడి వాసన గుప్పున కొట్టింది. పార్వతి, “పకోడి, పకోడి, ఉల్లిపాయ పకోడి” అని కేక వెసింది. వీళ్ళీదరికి వచ్చి మొహం మీద అడ్డంగా పకోడిల ప్లేటు పెట్టింది. కమ్మని వాసనకి రామకృష్ణ చెయ్యిపెట్టి తీస్కొబోతే, పళ్ళెం వెనక్కు లాగి “పొట్లం పది రూపాయలు” అంది. మహేష్ రామకృష్ణ తొడ మీద కొట్టి, “ఇరవై ఇచ్చి రెండు పొట్లాలు తీస్కో” అన్నాడు. ఇరవై తీసుకుని, రెండు పొట్లాలు వాళ్ళీదరి చేతిలో పెట్టి, బయటకు వెళుతూ తలుపు కొద్దిగా తెరిచి సినిమా చూడసాగింది. రూం లోపలిని లైటింగ్ పడటంతో ఈ సారి రామకృష్ణ గట్టిగా “తలుపెయ్, తలుపెయ్!” అని అరిచాడు. చుట్టూ చూసుకుని, తనెక్కడ వున్నాడో గ్రహించి సిగ్గుపడ్డాడు.

ఇంకా కొన్ని నిమిషాలలో “విశ్రాంతి” అని స్క్రీన్ మీద చూసి, గంగా మహేష్ లేచి లైటు వేసాడు. ఇద్దరూ కళ్ళూ నులుముటూ బయటకు వచ్చారు. మళ్ళీ సినిఫక్కీలోనే, డబ్బులు ఇచ్చి పార్వతి దగ్గిర ఇలాచి టీ తాగి, లొపలికి వచ్చి కూర్చుని సినిమాలో మునిగిపోయారు. ఒక పదినిమిషాలా తరువాత పార్వతి కూడా చేతిలో  పకోడీల పళ్ళెం, టీ వచ్చి వీరితో కలిసి కూరుచుని సినిమా చూడసాగింది. ముగ్గురూ ఫుల్ గా సినిమాలో మునిగిపోయారు.

 క్లైమాక్స్ ఫైట్ లో పార్వతి కూడా “ఖయ్యి”మని విజిల్ కొట్టసాగింది. అక్కను అలా చూసి రామకృష్ణ ఆశ్చరపోయాడు. పార్వతి కొంచెం సిగ్గుపడి, మళ్ళీ తేరుకుని విజిల్స్ వెయ్యసాగింది.  మహేష్ ఇదేమి పట్టనట్టుగా తన పంధాలో సినిమాని ఎంజాయ్ చేస్తున్నాడు. “శుభం” కార్డు పడినతరువాత, పారతిలేచి లైట్ వేసింది.  ముగ్గురూ కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చారు.

ఒకళ్ళని, ఒకళ్ళు చూసుకుని భళ్ళుమని నవ్వుకున్నారు. రామకృష్ణ పారవతి ని చూసి “అక్కా? నువ్వు విజిల్సా? మరీ ఇంత మాస్ గా ఎప్పుడు మారిఫొయావు?.”  

.పార్వతి కొద్దిగా సిగ్గు పడుతూ “చిన్నప్పటి కోరిక, ఇలా తీరిందిరా. ” అని భర్తని మురిపెంగా చూస్తూ, మహేష్ చెయ్యిపట్టుకుని, రామకృష్ణని చూస్తూ “రాము! నాకు పుట్టింట్లో  చిన్నపుడు సినిమాలు చూసే స్వేచ్చ వుంది కాని, ఒక ఆడ పిల్లకు వుండే కొన్ని కనిపించని కట్టుబాట్లు అలాగే వుండేవి. మగ పిల్లల్లాగా, కేరింతలు కొడుతూ, విజిల్స్ వేస్తూ సినిమా చూడాలని వుండేది. చిన్నాప్పుడు, అమ్మా-నాన్నా తోనె కలిసి వెళ్ళేవాళ్ళం. కాలేజి చదువులప్పుడు, ఇలాంటి సినిమా థియేటర్ వాతావరణం వున్నా, విజిల్స్ కొట్టే స్వేచ్చ వుండేది కాదు. మీ బావగారికి చిన్నప్పుడు ఊరిలో ఇలా చూసినట్టుగా సినిమా చూస్తేనే మజా! మల్టిప్లెక్సులు, వయసు వచ్చాకా, ఆ సరదా పోయింది. అలాగే నాకు కూడా హాల్లో కామెంట్స్ చేస్తూ, విజిల్ కొడుతూ సినిమా చూడాలని ఎప్పటిదో కోరిక. ఈ కరోనా వల్ల థియేటర్స్ మూతబడి,  ఇలా ఇంట్లో మ్యాట్నీ అయిడియా వేసారు మీ బావగారు.  ఊరిలో ఇలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలనే ఆయన సరదా, విజిల్స్ కొట్టాలనే ఎప్పటి నుండో నా తీరని  కోరిక,  ఇలా మీ బావగారి మ్యాట్ని ప్రోగ్రాం తో వారం వారం తీరుతోంది.” అంటూ హాయిగా నవ్వేసింది.

రామకృష్ణ కూడా తన అక్క నవ్వుతో శృతి కలిపాడు.  మ్యాట్ని వీరుడు ముసిముసి నవ్వులు న్యూస్ పేపర్ లోకి దూర్చాడు!

(సమాప్తం!) 

1

11 Comments Leave a Reply

  1. బావుంది స్టోరీ

    మ్యాట్నీ కి ఇచ్చిన బిల్డ్ అప్ ఉపాధ్ఘాతం గట్రా చూసిన అది కాస్త ‘మార్టిని’ – shaken but not stirred గా రూపొందుతుంది అన్నట్లుగా అనిపించింది

    ఉల్లిపాయ పకోడీలు / విజిల్స్ / మాస్ లెవెల్లో ఎంజాయ్ చేయడం ఇవన్నీ నిజంగా ఒక క్లాసికల్ మూవీ ఎక్స్పీరియన్స్ కి చెందినవి

    అవి కూడా అప్పుడప్పుడు అనుభవించాల్సిందే

    • అబ్బాహ్! భలే సూపర్ గా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. “Martini shaken, not stirred”, ఇది కొత్తగా నేర్చుకున్నా మీ నుండి.

        • అయ్యుండచ్చు! కానీ, ఒక “కానీ” సందేహం? జగన్ గారి భక్తి బాండ్ మీదా మార్టిని బ్రాండ్ మీదా అని….?

          • భక్తి కేవలం పద విన్యాసం పట్లే .. అది కూడా ఎటువంటి వినాశనం కలిగించినదే కావాలి అన్న మక్కువ / మంకుపట్టు కూడా

            వేరే ‘సోమరసాల’ అవసరం పడట్లేదు పెద్దగా .. ఎందుకంటే పదప్రయోగ తోనే ఏదో ఒక విధమైన ‘సామరస్యం’ అయిపోతూ ఉంటుంది లోలోపలే
            మా (కీ శే) నాన్నగారి పుణ్యమా అని పదనిస / పదనషా లు కొద్దో గొప్పో అబ్బాయి – కొంతమందికి ఇవి పద నస అని కూడా అనిపించవచ్చు

            ఎవరి రుచి / అభిరుచి వారిదే కదా!

  2. మాట్నీ అంటే ఏదో రొమాన్స్ సెక్స్ ఊహించాను ముందు. భలే ఉంది

    • రోమాంటిక్ కథ లాగా అనిపించే, సున్నితపు స్త్రీ వాద కథ!

      ఒక సగటు ఆడపిల్లకు ఉండని, ఒక చిన్న స్వేఛ్చా విషయాన్ని ఇలా చెప్పడం జరిగింది.

Leave a Reply to Antarvaahini Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

పెద్ద మనిషి చేసిన చిన్న తప్పు

ఇవాళ పొద్దున్నే పెద్ద తప్పు జరిగిపోయింది! అంటే నాలాంటి పెద్ద మనిషి చేసే

మళ్ళీ పండుగ ఎప్పుడొస్తుంది?

అందరికీ నమస్కారం 🙏నా పేరు డాక్టర్ రాఘవ, ముగ్గురు అమ్మాయిల తర్వాత పుట్టిన