కథాకదనం / Story Contest


#పలుకు.ఇన్ నిర్వాహక బృందం నుండి మిత్రులందరికీ శుభాకాంక్షలు.

ప్రముఖంగా తెలుగు ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించి, తెలుగు పాఠకులకు ఆసక్తికరమైన రచనలను అందించాలన్న ఆలోచనే, పలుకు.ఇన్.
ఆగస్టు 9న మీ ముందు ముస్తాబై నిలచిన ఈ వేదిక, మీ అందరి ఆదరణతో వినాయక చవితి పండగ చేసుకుంది. నేటికి 40మందికి పైగా సభ్యులను చేర్చుకుంది. తోటి తెలుగు భాషా ప్రేమికులుగా మీ అందరినీ, మీలోని రచయితని మన తెలుగు ప్రపంచానికి పరిచయం చేయమని ఆహ్వానిస్తోంది.

ఈ సందర్భంగా, ఈ దసరా పండగ వేడుకగా ఒక కథల పోటీ నిర్వహించబోతున్నాం. సెప్టంబర్ 19 మొదలు, అక్టోబరు 7 వరకు మీరు మీ కథలను మాకు పంపవచ్చు.
ఈ పోటీలో 16సం.లోపు వారు ఒక వర్గంగాను, 16సం. – అంతకు పైబడిన వారు మరొక వర్గంగాను విభజింపబడతారు.
ప్రతి వర్గం నుండి, ఎంపిక చేయబడిన మూడు కథలకు దీపావళి అనంతరం మా తరఫున బహుమానం అందచేయబడుతుంది.

పోటీ తాలూకు పూర్తి వివరాలు, మీ కోసం:

  1. సెప్టంబర్ 19 నుండి అక్టోబరు 7 వరకు, మీరు రాసిన ఒక కథ, పోటీ కోసం మాతో పంచుకోవచ్చు.
  2. పాల్గొనదలచిన వారు, పలుకు.ఇన్‌ లో సభ్యులై ఉండాలి. సభ్యత్వం ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు – https://paluku.in/register. సభ్యత్వం ఆమోదించిన అనంతరం పలుకు.ఇన్‌ లో మీ రచనను అప్‌లోడ్ చేయవచ్చు.
  3. పోటీకి పంపదలచిన కథను పోస్ట్ చేయటానికి తప్పనిసరిగా “#కథాకదనం” అనే హాష్‌టాగ్ కథాశీర్షిక / టైటిల్ లో వాడవలసి ఉంటుంది. అలాగే, కథాకదనం / Story Contest కాటగరీలోనే పోస్ట్ చేయవలసి ఉంటుంది.
  4. పోటీ రెండు వర్గాలుగా విభజింపబడుతుంది. 16సం. వయసు లోపు పిల్లల కోసం ఒక వర్గం. 16సం. నుండి వయో పరిమితి లేకుండా మరొక వర్గం.
  5. మీ 16 సం. లోపు పిల్లల కథలను మీ అకౌంటు ద్వార పంచుకోండి, పోస్టు క్రింద పిల్లల పేరు, చదువుతున్న క్లాసు పంచుకోండి.
  6. రచయితలు తమ స్వీయ రచన ఏదైనా (కథ) ఒక ఎంట్రీ మాత్రమే పంపగలరు. ఒకటికంటే ఎక్కువ రచనలు తిరస్కరించబడతాయి.
  7. మీరు రాసిన కథ నిడివి ప్రతి పేజీ/పుటకి 200-250 పదాలు చప్పున కనీసం 1000 పదాలు (4 pages) నుంచి మొత్తం మీద 2000 పదాలు  మించకుండా ఉండే విధంగా చూసుకోండి. 16 సం. లోపు పిల్లలకి కథ నడివి 500 పదాల నుంచి 1000-1200 పదాల వరకు ఉండేలా ప్రచురించండి.
  8. కథావస్తువు, కథనం పట్ల ఎంపిక మీదే. అయితే, అశ్లీలత, అభ్యంతరకరమైన భాష, రాజకీయ, సినీ మరే ఇతరుల గురించిన వ్యక్తిగత విమర్శలు, అసంగత ప్రస్తావనలు నిషేధం అని గమనించండి.
  9. పోటీకి పంపబడిన కథలలో, ప్రతి వర్గం నుండి, నిర్ణేతలు మెచ్చిన మూడు కథలకు బహుమతి అందచేస్తాము.
  10. ఈ పోటీకి సంబంధించినంత వరకూ, బహుమతికి అర్హతలున్న కథల ఎంపిక, బహుమతి వితరణాధికారం పూర్తిగా మా పలుకు.ఇన్ నిర్వాహకులది, నిర్ణేతలది మాత్రమే. ఈ విషయం పట్ల ఎటువంటి ప్రశ్నలు, విమర్శలు అంగీకరింపబడవు.
  11. రచయితలు పోటీతో సంబంధం లేని తమ ఇతర రచనలను కూడా ఎప్పటిలాగే పలుకు.ఇన్ బ్లాగ్ పేజి‌లో పంచుకోవచ్చు.

ఈ పోటీ ప్రకటన మీ మీ సమూహాలతో కూడా పంచుకోగలరని మా విన్నపం.

అభినందనలతో,
సంపాదకులు
పలుకు.ఇన్

5

2 Comments Leave a Reply

  1. 6. పోటీదారులు ఏ వర్గం వారైనా, తమ పూర్తి పేరు, అడ్రసు (ఊరి పేరు, పిన్ కోడ్ సహా,) ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రసు పంపవలసి ఉంటుంది.
    To Whom and where.

Leave a Reply to Badri J Cancel reply

Your email address will not be published.

x.com/palukublog

Don't Miss

నా ఇరాన్ యాత్ర -2

నా ఇరాన్ యాత్ర -2 గత సంచిక తరువాయి. లోపలికి ఎంటర్ అయ్యాము.

అంతరాత్మ – కటీఫ్!

ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో