#పలుకు.ఇన్ నిర్వాహక బృందం నుండి మిత్రులందరికీ శుభాకాంక్షలు.
ప్రముఖంగా తెలుగు ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించి, తెలుగు పాఠకులకు ఆసక్తికరమైన రచనలను అందించాలన్న ఆలోచనే, పలుకు.ఇన్.
ఆగస్టు 9న మీ ముందు ముస్తాబై నిలచిన ఈ వేదిక, మీ అందరి ఆదరణతో వినాయక చవితి పండగ చేసుకుంది. నేటికి 40మందికి పైగా సభ్యులను చేర్చుకుంది. తోటి తెలుగు భాషా ప్రేమికులుగా మీ అందరినీ, మీలోని రచయితని మన తెలుగు ప్రపంచానికి పరిచయం చేయమని ఆహ్వానిస్తోంది.
ఈ సందర్భంగా, ఈ దసరా పండగ వేడుకగా ఒక కథల పోటీ నిర్వహించబోతున్నాం. సెప్టంబర్ 19 మొదలు, అక్టోబరు 7 వరకు మీరు మీ కథలను మాకు పంపవచ్చు.
ఈ పోటీలో 16సం.లోపు వారు ఒక వర్గంగాను, 16సం. – అంతకు పైబడిన వారు మరొక వర్గంగాను విభజింపబడతారు.
ప్రతి వర్గం నుండి, ఎంపిక చేయబడిన మూడు కథలకు దీపావళి అనంతరం మా తరఫున బహుమానం అందచేయబడుతుంది.
పోటీ తాలూకు పూర్తి వివరాలు, మీ కోసం:
- సెప్టంబర్ 19 నుండి అక్టోబరు 7 వరకు, మీరు రాసిన ఒక కథ, పోటీ కోసం మాతో పంచుకోవచ్చు.
- పాల్గొనదలచిన వారు, పలుకు.ఇన్ లో సభ్యులై ఉండాలి. సభ్యత్వం ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు – https://paluku.in/register. సభ్యత్వం ఆమోదించిన అనంతరం పలుకు.ఇన్ లో మీ రచనను అప్‌లోడ్ చేయవచ్చు.
- పోటీకి పంపదలచిన కథను పోస్ట్ చేయటానికి తప్పనిసరిగా “#కథాకదనం” అనే హాష్‌టాగ్ కథాశీర్షిక / టైటిల్ లో వాడవలసి ఉంటుంది. అలాగే, కథాకదనం / Story Contest కాటగరీలోనే పోస్ట్ చేయవలసి ఉంటుంది.
-
- పోటీ రెండు వర్గాలుగా విభజింపబడుతుంది. 16సం. వయసు లోపు పిల్లల కోసం ఒక వర్గం. 16సం. నుండి వయో పరిమితి లేకుండా మరొక వర్గం.
- మీ 16 సం. లోపు పిల్లల కథలను మీ అకౌంటు ద్వార పంచుకోండి, పోస్టు క్రింద పిల్లల పేరు, చదువుతున్న క్లాసు పంచుకోండి.
- రచయితలు తమ స్వీయ రచన ఏదైనా (కథ) ఒక ఎంట్రీ మాత్రమే పంపగలరు. ఒకటికంటే ఎక్కువ రచనలు తిరస్కరించబడతాయి.
- మీరు రాసిన కథ నిడివి ప్రతి పేజీ/పుటకి 200-250 పదాలు చప్పున కనీసం 1000 పదాలు (4 pages) నుంచి మొత్తం మీద 2000 పదాలు మించకుండా ఉండే విధంగా చూసుకోండి. 16 సం. లోపు పిల్లలకి కథ నడివి 500 పదాల నుంచి 1000-1200 పదాల వరకు ఉండేలా ప్రచురించండి.
- కథావస్తువు, కథనం పట్ల ఎంపిక మీదే. అయితే, అశ్లీలత, అభ్యంతరకరమైన భాష, రాజకీయ, సినీ మరే ఇతరుల గురించిన వ్యక్తిగత విమర్శలు, అసంగత ప్రస్తావనలు నిషేధం అని గమనించండి.
- పోటీకి పంపబడిన కథలలో, ప్రతి వర్గం నుండి, నిర్ణేతలు మెచ్చిన మూడు కథలకు బహుమతి అందచేస్తాము.
- ఈ పోటీకి సంబంధించినంత వరకూ, బహుమతికి అర్హతలున్న కథల ఎంపిక, బహుమతి వితరణాధికారం పూర్తిగా మా పలుకు.ఇన్ నిర్వాహకులది, నిర్ణేతలది మాత్రమే. ఈ విషయం పట్ల ఎటువంటి ప్రశ్నలు, విమర్శలు అంగీకరింపబడవు.
- రచయితలు పోటీతో సంబంధం లేని తమ ఇతర రచనలను కూడా ఎప్పటిలాగే పలుకు.ఇన్ బ్లాగ్ పేజిలో పంచుకోవచ్చు.
ఈ పోటీ ప్రకటన మీ మీ సమూహాలతో కూడా పంచుకోగలరని మా విన్నపం.
అభినందనలతో,
సంపాదకులు
పలుకు.ఇన్
6. పోటీదారులు ఏ వర్గం వారైనా, తమ పూర్తి పేరు, అడ్రసు (ఊరి పేరు, పిన్ కోడ్ సహా,) ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రసు పంపవలసి ఉంటుంది.
To Whom and where.
ఆ నియమం తొలగించారండీ.