భాషాకుమారుడి స్వగతం
చేతులతో తన ముఖాన్ని మూసిన వెంటనే ఉన్నట్టుండి మాయమైపోయిందనీ, “బుయ్” అంటూ చేతులు తీసిన వెంటనే ఎలానో తిరిగి ఎదుటన ప్రత్యక్షమైందనీ అమ్మకేసి ఇంతింత చేసుకున్న లేతకళ్లతో చూస్తుండిపోయే ఆశ్చర్యానందాల పాలపాపాయిగా ఉన్నప్పుడే తెలుగు భాష మనల్ని పలుకరించింది. అప్పుడు చెవులతో కాదు, గుండెతో తెలుగును విన్నాం, అమ్మ నోటితో ఏదో చప్పుడు చేస్తోందని అనుకుంటూ. సహజశక్తులు మనలో