మన రైలు ప్రయాణం
ఏదో ఖాళీ రైలు బోగిలో కిటికీ పక్కన నువ్వు నీ పక్కన నేను ఆ కిటికీలోంచి నిన్ను చూసి పరవశించిపోతున్న కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఎగిరే పక్షులు, కేరింతలు కొట్టే పిల్లలు ముత్యాల్లా నా చెంపల మీద చిందే నీ కనుసన్నల నుంచి దూసుకు వచ్చే కంట నీరు నా అరచేతిని గట్టిగా కౌగిలించుకునే నీ అరచేతులు

