పెరుగన్నం, ఆవకాయముక్క
వారం రోజులు వారణాసిలో ఉండాలి అని శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి దంపతులు లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్లో రాత్రి తొమ్మిది గంటలకు దిగారు. ఎప్పుడో ఉదయం ఎనిమిది గంటలకు అమలాపురంలో తమ ఇంటి నుండి బయలుదేరి రాజముండ్రికి బస్సులో వచ్చి, అక్కడనుండి ఆటోలో ఎయిర్పోర్ట్ చేరుకొని కనెక్టింగ్ ఫ్లైట్స్లో వారణాసి చేరేసరికి ఇంత సమయమైంది. సత్రాలు ఏవి దొరకలేదు, వాటికోసం

