
నాన్న టీ షర్ట్
నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న కోసం ఒక టీ షర్ట్ కొన్నాను.ముదురు ఆకుపచ్చ టీ షర్ట్, ముందు IMPACT అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలల్లో ప్రింట్ ఉండేది. కొన్నది పెద్ద దుకాణం లో కాదు, వెచ్చించింది ఎక్కువ ఖరీదూ కాదు. ఎందుకంటే అప్పుడు నాది, చవకబారు రీసైకల్డ్ పేపర్, 10