అతివలు – కలువలు
కొలనంతా తామరలు. ఎర్రవి, తెల్లవి, దట్టంగా అల్లుకుని ఉన్నాయి. కెంపులు, పచ్చలు, రవ్వలు కలిపి చేసిన గుండ్రని పతకం భూదేవి మెడలో వేలాడుతున్నట్టు ఆ చెరువు ఎంత శోభగా ఉందో. అతడికి ఈ దృశ్యం అంత అబ్బురంగా ఏమి తోచలేదు. రోజూ చూసేదే. ఆ కొలనులోని తామరలు చూస్తే అతనికి తన విస్తరాకులోని మెతుకులు గుర్తొస్తాయి. మధ్యాహ్నం మూడు