సంసారం
1970 శ్రావణంలో వర్షం పడుతుండగా ఒక చీకటి రాత్రి (కరెంటు పోయింది లెండి), పెట్రోమాక్స్ దీపాల వెలుగులో తడిచిన వీధి అరుగు మీద గొడుగులు పట్టుకు కూర్చున్న పెద్దల సమక్షంలో సునందా గోవిందరావుల పెళ్లి జరిగింది అనుకుంటా. పెళ్ళైన కొత్తలో “నుదుట పెద్ద బొట్టు పెట్టుకో” అన్నాడు గోవిందరావు , “నాకు చిన్నదే ఇష్టం ” అన్నాది సునంద.

