స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటేo మనుషులోయ్!! ఇవాళ మన దేశం పుట్టినరోజు. దేశమంటే మనమే కాబట్టి ఇవాళ మనందరి పుట్టినరోజు! మరంచేత పొద్దున్నే పరకడుపునే ఇక్కడ కాలక్షేపం చెయ్యకుండా అర్జెంటుగా వెళ్లి తలంటు పోసుకోండి! ఆనక శుభాకాంక్షలు గట్రా తీరిగ్గా చెప్పుకుందాం. వీలయితే ఒక స్వీట్ తినండి ఆనందంగా. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఓ చిన్ని చాక్లెట్ తినచ్చు!

