బావుడి
ఆరుకు నుండి జేయపూర్ వెళ్లే దారిలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మేఘాలను అందుకుంటూ పచ్చని కొండల మధ్య దాక్కున్న ‘పాడువా’ అనే చిన్న గ్రామం. ఆ గ్రామపు చుట్టూ కొండకోనల్లో నిండుగా గిరిజన గూడేలు. ఆ గూడాల్లో ఎందరో పిల్లలు, వారిలో ఒకర్తి ‘చొంపా’. అడవిలో పెరిగిన సంపంగి మొగ్గలాగా సన్నగా నాజూగ్గా, నవ్వుతూ ఎక్కడికి వెళ్లినా చెలాకీగా మాట్లాడుతూ

