యాదమ్మింట్లా మామిడిచెట్టు
“వారీ! ఎవల్లల్ల ఆకెల్లి? మీ నోట్లల్లా మన్నుబడ, ఏం గత్తరొచ్చినాదిరా, నాగ్గాన దొరికిండ్రా? బిడ్డా! ఒక్కోనికి బొక్కలిరిపి బొంద పెడ్తా మళ్ళా” యాదమ్మ నోరు సగమూరిదాంక ఇనబడుతుండె.“అయ్యా! ఏమాయినే యాదమ్మ? పోరలను బొందలోపెడ్త నంటుంటివి, ఏంజేస్తిరే అంతమాగం?” శాయన్న సర్దిజెప్ప బోయిండు.“ఇంగో సూడు శాయన్న! సెట్టు మీద మామిడికాయల్ని బతకనిస్తలేరు, పొద్దాకుల గడ్డలిచ్చుక్కొడుతుండ్రు మంద, గడ్డలొచ్చి ఇంట్ల పడుతుండే,

