టిఫిన్ ఏమిటీ
“టిఫిన్ ఏం చెయ్యను” అంటూ వంటగది నుండి వస్తూనే అడిగింది సతీమణి.“ఉప్మా” తడుముకోకుండా జవాబు చెప్పాడు ఇంటాయన, హాల్లో మధ్యాహ్నం కూరకి ఉల్లిపాయలు కోస్తూ.తమ గదిలో కూర్చొని కాలక్షేపం చేస్తున్న పిల్లలిద్దరూ తమమీద పిడుగేదో పడినట్టు ఊలుక్కిపడి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి “ఉప్మాయా” అన్నారు దీనంగా.“ఏమైంది అమ్ము, మీ అమ్మ ఉప్మా చాలా బాగా చేస్తాది కదా, మీ

