కవితలు / Poetry & Verse - Page 2

మనసు తానై తానె నేనైంది నా పెంటి

సేను కాడ నేను సెమట గారుత వుంటేసెంగుతో తుడిసి నా అలుపు పోగొడతాదిసెలమ దడిసీ ఒల్లు సితసితామంటాంటెఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాదిఅరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపిముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాదిఅమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాదిఆలి ప్రేమకు ఇంగొక్క పేరు తానెలెమ్మంటాది గొంతు పొలమారితే నా సవితంటు నగుతాది గుండె తడిబారెనా తానె దిండై ఓదారుస్తాదినా ఇంటి ముంగిట్ల మావి
213 views
September 16, 2025

మన రైలు ప్రయాణం

ఏదో ఖాళీ రైలు బోగిలో కిటికీ పక్కన నువ్వు నీ పక్కన నేను ఆ కిటికీలోంచి నిన్ను చూసి పరవశించిపోతున్న కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఎగిరే పక్షులు, కేరింతలు కొట్టే పిల్లలు ముత్యాల్లా నా చెంపల మీద చిందే నీ కనుసన్నల నుంచి దూసుకు వచ్చే కంట నీరు నా అరచేతిని గట్టిగా కౌగిలించుకునే నీ అరచేతులు
August 3, 2025
42 views

మళ్ళీ పెళ్లా ..

ధాతా నామ సంవత్సరం, శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ల కాలం. నేను ఐదో తరగతి చదువుతున్న రోజులు. కాకినాడలో ఉన్న మా బామ్మా వాళ్ళ చెల్లెలి మనవరాలు పెళ్లి. అమ్మా నాన్న, బామ్మ తాతయ్య, నేను తమ్ముడు, అందరం పెళ్ళికి బయలుదేరాం. రెండు బల్ల రిక్షాలు మాట్లాడుకుని, కుటుంబమంతా కొత్త బట్టలు, దారిలోకి మరెయ్యడానికి చిరుతిళ్ళు,
August 2, 2025
21 views

ఏ జన్మ ఋణమో

సీతాపురంలోని రామాలయం వీధిలో రామలక్ష్మమ్మగారు అనే ఆవిడ తన ఒక్కగానొక్క కొడుకూ ఉంటుండేవారు. రామలక్ష్మమ్మగారి భర్త కొన్నాళ్ల క్రితమే కాలం చేశారు. కట్నంగా ఆవిడ తెచ్చిన పొలం కౌలుకిచ్చి, పాలు, పెరుగు అమ్ముకుంటూ బ్రతుకు బండి లాక్కొచ్చేవారు. భర్త పోయినప్పటి నుంచి రామలక్ష్మమ్మగారు రాముని సేవలో కాలం గడిపేవారు. గుడి, పాడి తప్ప వేరే లోకం ఎరుగదు. గుడి
August 2, 2025
20 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog