#తెలుగు - Page 2

ఇన్‌సైడ్‌మల్లి

ఈ తరం రచయిత వి.మల్లికార్జున్‌తో కాసేపు…   ఊరు నల్లగొండ. పేరు మల్లికార్జున్. ట్విట్టర్ అవతారం (X account) @insidemalli. చదువు పూర్తయిందన్న నాటికి ఇంజినీరుగా డిగ్రీ చేతిలో. రాయాలని దాచుకున్న కథలెన్నో మనసులో. ఉద్యోగం కొంత కాలం “సాక్షి,” “వెలుగు”పత్రికలలో. ఎలాగూ కలం చేతిలో. ఇక చుట్టూ చూసిన, చూస్తున్న లోకం, రెక్కలు కట్టుకు ఎగిరే తన ఊహాలోకం… రచయితగా సాకారం!  ఇరానీ కేఫ్, కాగితం
September 26, 2025
96 views

“వస్తానన్నాడు”

by
బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది ప్రియ. నిశ్శబ్దం… గాలి కూడా కదలని నిశ్చలత. ఆకాశం మేఘాలతో కప్పబడి, చంద్రుడు, చుక్కలు కనిపించటం లేదు. వర్షం వస్తుందేమో అనిపించింది. కరెంటు పోయి, చుట్టూ చీకటి. గదిలోనూ అంధకారమే. ఇన్వర్టర్ పనిచేయక చాలా కాలమైంది. కొవ్వొత్తి వెలిగించాలన్న ఆలోచన కూడా రాలేదు. “వస్తానన్నాడు…”
September 23, 2025
44 views

వింజమూరి కధలు – 2 – నేల టిక్కెట్టు

“మోవ్… నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నాకు సైడ్ క్రాఫ్ వద్దు, పైకి దువ్వు” అరిచాడు తిరుమల. పక్కకి దువ్వితే బావుంటావు రాజా.. నవ్వుతూ తల దువ్వింది అమ్మ. తిరుమల అప్పుడే ఆరో క్లాస్ లోకి వచ్చాడు. ఎలిమెంటరీ బడి నుంచి ప్రమోషన్ వచ్చి జెడ్పీపీఎస్ బాయ్స్ హైస్కూల్ లో చేరాడు. చిరంజీవి, సినిమా, ఫ్రెండ్స్, క్రికెట్, అదే ఒక
September 19, 2025
36 views

మనసు తానై తానె నేనైంది నా పెంటి

సేను కాడ నేను సెమట గారుత వుంటేసెంగుతో తుడిసి నా అలుపు పోగొడతాదిసెలమ దడిసీ ఒల్లు సితసితామంటాంటెఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాదిఅరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపిముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాదిఅమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాదిఆలి ప్రేమకు ఇంగొక్క పేరు తానెలెమ్మంటాది గొంతు పొలమారితే నా సవితంటు నగుతాది గుండె తడిబారెనా తానె దిండై ఓదారుస్తాదినా ఇంటి ముంగిట్ల మావి
September 16, 2025
254 views

పెరుగన్నం, ఆవకాయముక్క

by
వారం రోజులు వారణాసిలో ఉండాలి అని శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి దంపతులు లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్లో రాత్రి తొమ్మిది గంటలకు దిగారు. ఎప్పుడో ఉదయం ఎనిమిది గంటలకు అమలాపురంలో తమ ఇంటి నుండి బయలుదేరి రాజముండ్రికి బస్సులో వచ్చి, అక్కడనుండి ఆటోలో ఎయిర్పోర్ట్ చేరుకొని కనెక్టింగ్ ఫ్లైట్స్లో వారణాసి చేరేసరికి ఇంత సమయమైంది. సత్రాలు ఏవి దొరకలేదు, వాటికోసం
September 14, 2025
73 views

టిఫిన్ ఏమిటీ

by
“టిఫిన్ ఏం చెయ్యను” అంటూ వంటగది నుండి వస్తూనే అడిగింది సతీమణి.“ఉప్మా” తడుముకోకుండా జవాబు చెప్పాడు ఇంటాయన, హాల్లో మధ్యాహ్నం కూరకి ఉల్లిపాయలు కోస్తూ.తమ గదిలో కూర్చొని కాలక్షేపం చేస్తున్న పిల్లలిద్దరూ తమమీద పిడుగేదో పడినట్టు ఊలుక్కిపడి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి “ఉప్మాయా” అన్నారు దీనంగా.“ఏమైంది అమ్ము, మీ అమ్మ ఉప్మా చాలా బాగా చేస్తాది కదా, మీ
September 7, 2025
71 views

జయ జయ జయ శ్రీ వినాయకా

జయ జయ జయ శ్రీ వినాయకామమ్మెన్నడు కావవె వినాయకాగణరాయ జయము శ్రీ వినాయకాభక్తజన గణ రక్షక వినాయకా అంబ నలచె నలుగు శ్రీ వినాయకాసలుగు నిన్ను బడయగా వినాయకాగడప నిలిపి అయ్యను శ్రీ వినాయకాగజముఖధారి వైతివట వినాయకా అమ్మ యానతి నీకట శ్రీ వినాయకాఅబ్బ అబ్బొ యనంగదె వినాయకాశివ తాండవ కేళి నీవె శ్రీ వినాయకాగౌరి ముద్దు పట్టి
September 6, 2025
52 views

భాషాకుమారుడి స్వగతం

చేతులతో తన ముఖాన్ని మూసిన వెంటనే ఉన్నట్టుండి మాయమైపోయిందనీ, “బుయ్” అంటూ చేతులు తీసిన వెంటనే ఎలానో తిరిగి ఎదుటన ప్రత్యక్షమైందనీ అమ్మకేసి ఇంతింత చేసుకున్న లేతకళ్లతో చూస్తుండిపోయే ఆశ్చర్యానందాల పాలపాపాయిగా ఉన్నప్పుడే తెలుగు భాష మనల్ని పలుకరించింది. అప్పుడు చెవులతో కాదు, గుండెతో తెలుగును విన్నాం, అమ్మ నోటితో ఏదో చప్పుడు చేస్తోందని అనుకుంటూ. సహజశక్తులు మనలో
August 19, 2025
81 views

సంసారం

by
1970 శ్రావణంలో వర్షం పడుతుండగా ఒక చీకటి రాత్రి (కరెంటు పోయింది లెండి), పెట్రోమాక్స్ దీపాల వెలుగులో తడిచిన వీధి అరుగు మీద గొడుగులు పట్టుకు కూర్చున్న పెద్దల సమక్షంలో సునందా గోవిందరావుల పెళ్లి జరిగింది అనుకుంటా. పెళ్ళైన కొత్తలో “నుదుట పెద్ద బొట్టు పెట్టుకో” అన్నాడు గోవిందరావు , “నాకు చిన్నదే ఇష్టం ” అన్నాది సునంద.
August 17, 2025
62 views

ఐ ఫోన్లో తెలుగులో టైప్ చేయడం ఎలా?

మీ ఐఫోన్లో సెట్టింగ్స్ తెరచి జనరల్ -> కీ బోర్డ్ దగ్గరకి వెళ్ళండి. ఇప్పుడు తెలుగు ( అక్షరమాల ) కీ బోర్డుని జోడించండి. తెలుగు అక్షర మాల కీ బోర్డుని జోడించాక, మీకు కుడి పక్కన “క” అని తెలుగు కీ బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన అప్లికేషన్లో ఎప్పటిలానే తెంగ్లీషులో టైప్ చేస్తే తెలుగు
August 15, 2025
90 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog